ప్రగ్య బొడ్డుపై పూలు, పళ్లు?

అన్నమయ్య నైనా, రామదాసు నైనా డ్యూయట్ లు పాడించి, సరససల్లాపాల్లో మునిగి తేలించడం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్టయిల్. ఇప్పుడు మళ్లీ అదే విద్యను ప్రదర్శించే ప్రయత్నంలో వున్నారు. హాథీరామ్ బాబా చరిత్ర ఆధారంగా, ఓం…

అన్నమయ్య నైనా, రామదాసు నైనా డ్యూయట్ లు పాడించి, సరససల్లాపాల్లో మునిగి తేలించడం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్టయిల్. ఇప్పుడు మళ్లీ అదే విద్యను ప్రదర్శించే ప్రయత్నంలో వున్నారు. హాథీరామ్ బాబా చరిత్ర ఆధారంగా, ఓం నమో వేంకటేశాయ అనే భక్తిరస సినిమా తీస్తూ, అందులో డ్యూయట్ స్మూత్ గా చొప్పించేసారు. 

ప్రగ్యా జైస్వాల్ లాంటి మెరుపుతీగ లాంటి అందగత్తెను తీసుకు వచ్చి, గడచిన రెండు మూడు రోజులుగా నాగ్ చేత పూలు, పళ్లు విసిరించే పనిలో పడ్డారు. రసికేంద్రడు రాఘవేంద్రరావు టేస్ట్ కు తగ్గట్టు తయారుచేసిన సెట్ లో నాగ్, ప్రగ్య డ్యూయట్ చిత్రీకరణ జరుగుతోంది. 

మరోక్క రోజులో ఇది పూర్తవుతుంది. అంతా పూర్తయి, సినిమా విడుదలైతే తప్ప తెలియదు, ఈ భక్తిరస సినిమాలో రసికత ఎలా ఇమిడిపోయిందో?