ఆ మధ్య కిమ్ కర్దాషియన్ పై పారిస్ లోనే దాడి జరిగింది. ఆమె బస చేస్తున్న హోటల్ లోకి చొరబడి కొందరు దొంగలు.. ఆమెను కొట్టి డబ్బును, నగలను దోచుకుని వెళ్లారు. దీనిపై ఆమె గగ్గోలు పెట్టింది. అసలే వివాదాస్పద శృంగారతార.. అలాంటి దాడికి గురయ్యే సరికి ఆమె బిత్తరపోవడంతో పాటు, పారిస్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఘటన విషయంలో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ సంఘటన జరిగి కొన్నాళ్లైనా గడిచాయో లేదో.. తాజాగా మల్లికా షెరావత్ పై పారిస్ లో దాడి జరిగిన వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియా సినిమాకు పూర్తిగా విరామం ఇచ్చి, అంతర్జాతీయ సినిమాల్లో, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో పని చేయడానికి మల్లిక పారిస్ కు మకాం మార్చింది. ఓవరాల్ గా మల్లిక అలజడి అయితే పెద్దగా లేదు కానీ.. తాజాగా దాడి జరిగడంతో మల్లిక మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
కిమ్ పై ఒక హోటల్ లో దాడి జరగగా.. మల్లికపై ఆమె సొంత అపార్ట్ మెంట్ లోనే దాడి జరిగింది. కొందరు ముసుగు మనుషులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారని, టియర్ గ్యాస్ వెదజల్లి, ఆమెను కొట్టి.. దోచుకెళ్లారని తెలుస్తోంది. మరి ఎంత దోచుకెళ్లారు, ఏయే వస్తువులను ఎత్తుకెళ్లారు అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు.
విశేషం ఏమిటంటే.. ఆ అపార్ట్ మెంట్లో మల్లికతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని పారిస్ పత్రికలు రాస్తున్నాయి. అతడి వయసు నలభై అని మాత్రం అవి చెబుతున్నాయి. ఇంతకీ అతగాడెవరో.. ఈ ఘటనపై మల్లిక స్పందన ఏమిటో!