Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి చూపు బాలయ్య వైపు?

పూరి చూపు బాలయ్య వైపు?

హీరోలు ఎవరు దొరుకుతారా? మూడ్నెల్లలో మరో సినిమా తీసి పక్కన పెట్టేద్దామా అని చూస్తున్నట్లుంది దర్శకుడు పూరి జగన్నాధ్ పరిస్థితి. కళ్యాణ్ రామ్ తో ఇజమ్ అయిపోయింది. పూరీకి సినిమా మేకింగ్ మీద శ్రద్ధ తగ్గింది అన్నది మరోసారి నిజమ్ అయిపోయింది. మరి తరువాత ఎవరు? మహేష్ తో జనగణమనకు జనగణమన పాడేసినట్లే అని టాక్ వినిపిస్తోంది. 

రామ్ తో సినిమాకు ప్రయత్నిస్తున్నారు అని వార్తలు వినవచ్చాయి. కానీ మెటీరియలైజ్ అవుతున్న దాఖలాలు లేవు. ఇంకెవరు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో నందమూరి నటరత్నం బాలయ్య కోసం ఓ స్క్రిప్ట్ తయారుచేసారని టాక్. కృష్ణవంశీ రైతు సినిమాకు మూడు నెలలు గ్యాప్ వస్తుండడంతో, ఈ మూడు నెలలు బాలయ్య ఖాళీగా వుంటారని, తెలిసి, ఆ గ్యాప్ ను తాను ఫిల్ చేస్తానంటూ పూరి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు డిఫరెంట్ సినిమాలు తీసి ఇచ్చిన క్రెడిట్ తో, బాబాయ్ కు కూడా నమ్మకం కుదిరేంతగా ఓ మాంచి స్క్రిప్ట్ చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వెయిట్ అండ్ సీ..ఏం జరుగుతుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?