పవన్‌ దగ్గర బడ్జెట్‌ లేదు

రామ్‌ చరణ్‌ హీరోగా తన నిర్మాణంలో ఒక సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించిన పవన్‌కళ్యాణ్‌ దాని కంటే ముందుగా నితిన్‌తో సినిమా మొదలు పెట్టడం ఆశ్చర్య పరిచింది. రామ్‌ చరణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా…

రామ్‌ చరణ్‌ హీరోగా తన నిర్మాణంలో ఒక సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించిన పవన్‌కళ్యాణ్‌ దాని కంటే ముందుగా నితిన్‌తో సినిమా మొదలు పెట్టడం ఆశ్చర్య పరిచింది. రామ్‌ చరణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా తీయాలనేది పవన్‌కళ్యాణ్‌ ప్లాన్‌. 

అయితే ఆ చిత్రానికి బడ్జెట్టే యాభై కోట్ల పైన అవుతుంది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభంలో అంతటి భారీ చిత్రానికి ఫైనాన్స్‌ రాబట్టడం కష్టమవుతుంది. అందుకే ఆ ప్రాజెక్ట్‌ని వాయిదా వేసి, నితిన్‌తో చిన్న సినిమా ప్లాన్‌ చేసాడు. ఇరవై కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రానికి పవన్‌, త్రివిక్రమ్‌ల బ్రాండింగ్‌ పెద్ద ప్లస్‌ అవుతుంది. 

ఇలా మొదట రెండు, మూడు చిన్న చిత్రాలు నిర్మించిన తర్వాత భారీ చిత్రానికి శ్రీకారం చుడతాడట. హీరోగా రిటైర్‌ అయిన తర్వాత కూడా నిర్మాతగా సినీ పరిశ్రమలో కొనసాగడానికి పవన్‌కళ్యాణ్‌ నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గ ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నడుచుకుంటున్నాడు.