చందు చేతిసాయం క్లిక్కయింది

చందు మొండేటి దర్శకుడికి తొలి సినిమా చేసేందుకు కిందా మీదా అయ్యాడు. ఎక్కని గుమ్మం, దిగని గుమ్మం లేదు. అలాంటి టైమ్ లో నిఖల్ ఆదుకుని, తొలి సినిమాగా కార్తికేయ చేసాడు. దాంతో చందు…

చందు మొండేటి దర్శకుడికి తొలి సినిమా చేసేందుకు కిందా మీదా అయ్యాడు. ఎక్కని గుమ్మం, దిగని గుమ్మం లేదు. అలాంటి టైమ్ లో నిఖల్ ఆదుకుని, తొలి సినిమాగా కార్తికేయ చేసాడు. దాంతో చందు దశ తిరిగిపోయింది. ఆ కృతజ్ఞతతోనే నిఖిల్ కు సాయం చేసి రుణం కాస్త తీర్చేసుకున్నాడు. 

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాకు స్క్రిప్ట్ లో చందు చేయి వుందని తెలుస్తోంది. సినిమాకు అబ్బూరి రవి మాటల రచయిత అయినా, ఫస్ట్ కామెడీ సీన్లను చాలా వరకు చందు చేతి సాయం చేసాడని వినికిడి. ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వెన్నెల కిషోర్, తదితరులపై పండిన ఫన్ సీన్లన్నింటి వెనుక చందు హ్యాండ్ వుందని తెలుస్తోంది. 

ఆ రెండు జాగ్రత్తలు

సినిమా షూట్ ప్రారంభమైన కొన్నాళ్లకే నిఖిల్ రెండు కీలక మార్పులు చేయడం కూడా కలిసి వచ్చింది. సినిమాటోగ్రాఫర్ ను అర్జెంట్ గా మార్చేసాడు. సాయి శ్రీరామ్ ను తీసుకువచ్చి సెట్ చేసాడు. ఇప్పుడు సినిమాకు రిచ్ లుక్ వచ్చిందంటే దానికి కారణం సాయి శ్రీరామ్ నే. 

అలాగే అవిక గౌర్ ను అయేషా క్యారెక్టర్ కు ఒప్పించారు. అందుకోసం ఏకంగా నలభై లక్షల పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. చిన్న పాత్ర అయినా, దానికి అవిక మాత్రమే సరిపోతుందని డిసైడ్ అయి, అంత పారితోషికం ఇచ్చి, ఒప్పించారు.