సినిమాల్లో నటించడం కన్నా, వ్యాపారాలు, సినిమా నిర్మాణంపైనే రామ్ చరణ్ ఎక్కువ ఆసక్తిగా వున్నాడట. ఈ మేరకు ఇండస్ట్రీ సర్కిళ్లలో వదంతులు వినిపిస్తున్నాయి. తండ్రితో ఓ సినిమా చేయాలనో, తల్లి తన పేరును తెరపై నిర్మాతగా చూసుకోవాలని కోరిందనో కాకుండా, సినిమా నిర్మాణాన్ని ఓ పద్దతిగా టేకప్ చేసి, మామయ్య అల్లు అరవింద్ మాదిరిగా అన్ని విధాలా సినిమా వ్యాపారాలు చేపట్టాలన్నది చరణ్ లాంగ్ టెర్మ్ ప్లాన్ అని తెలుస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసినపుడే ఈ మేరకు ఫిక్సయ్యాడట. ఎంతలా ఫిక్స్ అయ్యాడూ అంటే, షూటింగ్ విషయంలో సాధారణంగా అద్దెకు తెచ్చే కొన్ని సామగ్రిని, ఏకంగా కొనుగోలు చేసేసి, వాటిపై కంపెనీ పేర్ల రాయించేసాడంట. షూటింగ్ స్పాట్ లో అవసరమైన కేటరింగ్ సామగ్రి కూడా కొనేసి, వాటిపై పేర్లు రాయించేసాడట. అంటే అప్పుడే ఇదంతా గమనించిన వాళ్లు అనుకున్నారట, ఇక ఇలా ప్రొడక్షన్లు కంటిన్యూగా వుంటాయన్నమాట అని.
పైగా సినిమాల్లో నటించడం కన్నా, నిర్మించడంలో కాస్త ప్లానింగ్, మేనేజ్ మెంట్ తదితర విషయాలు తనకు నచ్చుతున్నాయని, చరణ్ సన్నిహితులతో కామెంట్ చేసినట్లు టాక్. మెగాస్టార్ తో సినిమా తరువాత కొందరు యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట చెర్రీ.మొత్తానికి మెగా హీరోల్లో చరణ్ కు, బన్నీకి, వరుణ్ తేజకు, పవన్ కు అందరికీ బ్యానర్లు వున్నాయి. ఇక సాయి ధరమ్ తేజ మాత్రమే మిగిలాడు.