కత్రినాకైఫ్.. ప్రేమ వార్తల్లో తన పేరు కొత్తేం కాదు. గతంలో సల్మాన్ తో ఆ తర్వాత రణ్ భీర్ తో ఆ వెంటనే మరో బాలీవుడ్ హీరోతో కత్రినా ప్రేమాయణ వార్తలు వచ్చాయి. వీరిలో సల్మాన్ తో ఆమె చాలా క్లోజ్ గానే ఉండేది. అప్పుడెప్పుడో సల్మాన్ అరెస్టయ్యి జైలు పాలయితే.. కొన్ని రోజుల పాటు జైల్లో గడిపితే తరచూ పరామర్శకు కూడా వెళ్లేది కత్రినా. జైలు ముందు ఈమె విషాదవదనంతో ఉండటం కూడా అప్పట్లో పత్రికలకు ఎక్కింది.
ఎందుకో సల్మాన్ తో బ్రేకప్ అయ్యింది. కొంత కాలం కిందట రణ్ భీర్ తో కత్రినా సహజీవనమే చేసిందనే మాట వినిపించింది. వీళ్లిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, బీచ్ లలో సరదాగా గడపడానికి సంబంధించిన ఫొటోలు కూడా వార్తల్లో వచ్చాయి. అయితే కొంత కాలం కిందట రణ్ భీర్ తో కూడా కత్రినా విడిపోయింది. వీళ్లిద్దరూ తమ లవ్ నెస్ట్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మరోహీరోతో కత్రినా ప్రేమాయణాన్ని మొదలుపెట్టిందని వార్తలు వచ్చినా.. వాటికి ఊతం దొరకలేదు. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు కత్రినా ఏకంగా భారతదేశంలోనే అత్యంత శ్రీమంతుడు అయిన ముఖేష్ అంబానీ తనయుడిని ప్రేమలో దించిందనే హాట్ గాసిప్ బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
ముఖేష్ చిన్న తనయుడు ఆకాష్ అంబానీకి కత్రినా క్లోజ్ అయ్యిందని సమాచారం. వీళ్లిద్దరూ జంటగా విహరించడం జరుగుతోందట. వీళ్లు బాలీవుడ్ జనాల కంట కూడా పడటంతో ఇప్పుడు ఈ అంశంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి కత్రినా ఈ సారి ఒక రిచెస్ట్ బాయ్ ఫ్రెండ్ ను సంపాదించినట్టుగా ఉంది. విశేషం ఏమిటంటే ఆకాష్ అంబానీ కత్రినా కన్నా వయసులో చిన్నవాడే. అయితేనేం.. ప్రేమలో అనుభవాలు మాత్రం ఉన్నాయి. ఇది వరకూ ఊర్వశి రౌటెల్లాతో కూడా ఇతడికి ప్రేమాయణం సాగించిన అనుభవం ఉంది.