నాకు అధికారం అక్కరలేదు. ప్రజల కోసం ఏదైనా చేయాలి అదే నా తపన అంటారు పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. కానీ ఆయన మాత్రం పవర్ ఎక్కడుంటే అక్కడే వుంటారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఎవరికి మద్దతుగా వున్నారు. పవర్ లో వున్న చంద్రబాబుకు మద్దతుగా వున్నారు. ఎవరిని విమర్శిస్తున్నారు? ఆంధ్రలో జనం మళ్లీ ఓట్లేయరు అని డిసైడ్ అయిన భాజపాను.
ఇదిలా వుంటే అన్నతమ్ముల ఇళ్లలో ఏ ఫంక్షన్ లు అయినా పవర్ స్టార్ హాజరుకారు. 'వాడిని మేం రమ్మని పిలుస్తాం..వాడు రాడు..మేం ఏం చేస్తాం' ఈ మాటలు అన్నది స్వయానా పవర్ స్టార్ బ్రదర్ నాగబాబు. ఆ మధ్య ఫ్యామిలీ ఫంక్షన్లకు దేనీకీ పవన్ హాజరయిన ధాఖలాలు లేవు.
అలాంటిది నిన్నటికి నిన్న మంత్రి శ్రీనివాస యాదవ్ కుమార్తె పెళ్లికి మాత్రం పవర్ స్టార్ ఠంచన్ గా హాజరయ్యారు. ఇది చూసి టాలీవుడ్ జనాల ఆశ్చర్యపోయారు. మిగిలిన సెలబ్రిటీలు హాజరుకావడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లు పెద్ద వాళ్లు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎవరు పిలిచినా వెళతారు.
కానీ పవన్ అలా కాదు. పవన్ ఇలా వెళ్లడానికి కారణం, శ్రీనివాసయాదవ్ తెలంగాణ మంత్రి అది కూడా సినిమా రంగానికి చెందిన మంత్రి కావడమే కారణం అని టాక్. పవర్ స్టార్ పవర్ ఎక్కడుంటే అక్కడుంటారని చతుర్లు వేస్తున్నారు.