బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు ఓకె బ్యానర్ లో చేయడానికి ఓకె చేయడంతోనే పెద్ద తప్పులో కాలేసాడు హీరో రాజ్ తరుణ్. ఒక బ్యానర్ లో మూడు సినిమాలు అంటే ఒకదాని వెనుక మరోకటి చేస్తారు కానీ, ఏ రెండూ ఒకేసారి తీసేసే పరిస్థితి వుండదు. జస్ట్ ఈ పాయింట్ మరిచిపోయాడు.
పెద్ద హీరోల మాదిరిగా ఏడాదికో సినిమా ఇచ్చే పరిస్థితి వుండదు రాజ్ తరుణ్ లాంటి అప్ కమింగ్ హీరోలకు. ఏదో కిందా మీదా పడి ఒక సినిమాను పూర్తి చేసాం అనిపించారు. రెండో సినిమాకు కథ దగ్గర గ్రహణం వచ్చింది. డైరక్టర్ మారుతి ప్రాజెక్టు నుంచి పార్టనర్ గా తప్పుకున్నారు. ఆ తరువాత సినిమాకు ఫిక్స్ అయిన లేడీ డైరక్టర్ తప్పుకున్నారు. ఇంతలో ఆ ప్రాజెక్టునే పక్కన పెట్టి వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో మూడో సినిమా మొదలు పెట్టారు.
కానీ ఈ మధ్యలో వీడు గోల్డ్ సినిమా కాస్త గట్టిదెబ్బె తీసింది నిర్మాతలను. దాని రాజ్ తరుణ్ సినిమాల మీద కూడా పడింది. పోనీ పూర్తయిన సినిమాను విడుదల చేస్తే, తరువాతి దాన్ని ఫినిష్ చేయవచ్చు అనుకుంటే, ఇప్పుడు ఈ నోట్ల రద్దు సమస్య వచ్చిపడింది. విడుదలకు డేట్ అన్నదే కనిపించడం లేదు.
వారానికి ఒక్క సినిమా విడుదలయినా కష్టంగానే వుంది. ఈ లెక్కన వచ్చేనెల అంతా కూడా సినిమాలు వున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ ఏం చేస్తాడో? ఎలా గట్టెక్కుతాడో మరి? ఎంతమంది నిర్మాతలు రెడీ గా వున్నా, ఒకే బ్యానర్ కు మూడు సినిమాలు సైన్ చేసిన ఫలితం ఇది.