Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీనివాసరెడ్డి, పృధ్వీ.. జర్రంత జాగ్రత్త

శ్రీనివాసరెడ్డి, పృధ్వీ.. జర్రంత జాగ్రత్త

టాలీవుడ్ లో భలే వ్యవహారాలుంటాయి. హీరోలు నిర్మాతలుగా మారినా, డైరక్టర్లుగా మారినా, జాతకాలు చాలా వరకు మారిపోతాయి. అలాగే కమెడియన్లు హీరోలుగా మారినా కూడా. కానీ రేలంగి దగ్గర నుంచి ధన్ రాజ్ వరకు అందరు కమెడియన్లు ఒక్కసారి అయినా హీరో వేషం వేయాలుకున్నవారే. అలా ఒకసారి వేయాలనుకుంటే ఓకె. కానీ అలాగే కొనసాగాలంటే మాత్రం చాలా కష్టం. రాజబాబు రెండు సార్లు హీరోగా చేసి, ఆపై నిర్మాతగా మారి కనుమరుగైపోయారు.  

ఎవీఎస్, బ్రహ్మానందం కూడా హీరోలుగా ట్రయ్ చేసినా, కమెడియన్లుగానే కొనసాగారు. ఆలీ ఒక్క సారిగా హీరోగా మారి, ఆ తరువాత వాస్తవం అర్థమై, కమెడియన్ గా కొనసాగారు. వేణుమాధవ్ హీరోగా మారి, పరిస్థితి అర్థమై కమెడియన్ గా వుండిపోయారు. ధన్ రాజ్ రెండు సినిమాలు హీరోగా ట్రయ్ చేసి, ఇప్పుడు కమెడియన్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. తాగుబోతు రమేష్ పరిస్థితి అంతే. ఏస్ కమెడియన్ అనిపించుకున్న సునీల్ హీరోగానే ఫిక్సయిపోయి, స్ట్రగుల్ పడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మంచి కమెడియన్లుగా, జనంలో ఇమేజ్ తెచ్చుకున్న ఇద్దరు టాప్ కమెడియన్లు హీరోలుగా జనం ముందుకు రాబోతున్నారు. మంచి డిక్షన్, మంచి బాడీ లాంగ్వేజ్ వున్న శ్రీనివాసరెడ్డి జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరోగా జనం ముందుకు వస్తున్నారు. అలాగే ఇటీవల మాంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించిన పృధ్వీ కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాతో జనం ముందుకు హీరోగా రాబోతున్నారు. 

అయితే వీరిద్దరూ కూడా హీరోలుగా మారిపోయామని కానీ, కమెడియన్లుగా కొనసాగమని కానీ ఇంకా చెప్పలేదు. ఏ నిర్ణయం ఈ రెండు సినిమాల విడుదల మీదే ఆధారపడి వుంటుంది. అయితే రెండు సినిమాలపై మంచి బజ్ వుంది. ఇన్ సైడ్ టాక్ కూడా బాగానే వుంది. అందువల్ల సక్సెస్ వస్తే హీరోలుగా మారిపోదాం అనుకునే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచింది. ఎందుకంటే కమెడియన్ల లైఫ్ కు, అవకాశాలకు, హీరోల వ్యవహారాలకు చాలా తేడా వుంటుంది. 

పైగా ఇప్పుడు టాలీవుఢ్ ను మంచి కమెడియన్ల కొరత పట్టి పీడిస్తోంది. జబర్ధస్త్ కమెడియన్లకు ఆదరణ వుంటోంది కానీ, స్టడీగా లేదు వ్యవహారం. కానీ పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు మంచి కమెడియన్లుగా ప్రూవ్ చేసుకున్నారు. అందువల్ల తమతమ సరదా కోసం అప్పుడప్పుడు హీరోలుగా చేయడం వరకు ఓకె. కానీ పూర్తి స్థాయి హీరోలుగా మారాలనుకునే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అవసరం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?