రోజుకు నాలుగు నుంచి అయిదు లక్షల మేరకు డిమాండ్ చేసి తీసుకున్న కమెడియన్ ఆయన. ఫుల్ పీక్స్ లో నెల పొడవునా ఖాళీ లేకుండా పనిచేసారు. పైగా ఆయనకు ఓ రూల్ వుంది. పది రోజులు పని చేస్తే, అయిదు రోజులకే చెక్ ఇవ్వాలి. అయిదు రోజులకు క్యాష్ రూపంలో బ్లాక్ లో ఇవ్వాలి. ఇలా వచ్చిన డబ్బును అందరిలాగే ఆయనా భూముల మీదే పెట్టారట.
అయితే కొంత కాలం క్రితం అవకాశాలు తగ్గిపోతున్నపుడు ఇక భూములు కొనడం మానేసి, క్యాష్ రూపంలో స్టాక్ పెట్టడం ప్రారంభించారని వినికిడి. అలా పోగయిన మొత్తం కాస్త ఎక్కువే వుంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిసున్నాయి. ఎందుకంటే గట్టిగా మూడు నెలలు బ్లాక్ లో తీసుకున్నది స్టాక్ పెట్టినా కూడా ఈజీగా మూడు నాలుగు కోట్లు వుంటుంది.
పైగా ఆ కమెడియన్ పెద్దగా ఖర్చులు పెట్టరని, షూటింగ్ ల టైమ్ లో అన్నీ నిర్మాత మీదే వేస్తారని విమర్శలు కూడా వున్నాయి. అందువల్ల క్యాష్ కందకుండా, కదలకుండా వుండే అవకాశం వుందని, మరి ఇప్పుడు ఏమిటో పరిస్థితి అని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.