ఏదిసత్యం? ఏది అసత్యం? బాహుబలీ?

బాహుబలి మీద ఐటి రెయిడ్ జరిగిన దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టుకువస్తున్నాయి. ముఖ్యంగా యాభై కోట్ల వరకు నగదు దొరికిందన్నది ప్రధానంగా వినిపిస్తోంది. అయితే లెక్కల ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి కానీ, నగదు…

బాహుబలి మీద ఐటి రెయిడ్ జరిగిన దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టుకువస్తున్నాయి. ముఖ్యంగా యాభై కోట్ల వరకు నగదు దొరికిందన్నది ప్రధానంగా వినిపిస్తోంది. అయితే లెక్కల ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి కానీ, నగదు దొరికలేదు అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. దీనికి తప్పిదం ఐటి శాఖదే అని టాలీవుడ్ వర్గాల కామెంట్. బాహుబలి టీమ్ తో దగ్గర సంబంధాలున్న నిర్మాత సాయి కొర్రపాటి. ఆయన ఆఫీసు మీద కొద్ది రోజుల క్రితమే దాడి జరిగింది. 

ఆ దాడి జరిగిన మరు క్షణమే బాహుబలి ఆఫీసులో సర్దుబాట్లు జరిగిపోయినట్లు తెలుస్తోంది. కేవలం బాహుబలి ఆపీసులోనే కాదు, సాయి కొర్రపాటితో అనుబంధం వున్న 14 రీల్స్, ఎకె ఎంటర్ టైన్స్ మెంట్స్ తదితర కార్యాలయాలు కూడా ఎక్కడి లెక్కలు అక్కడ అర్జెంట్ గా సర్దుబాటు చేసేసుకున్నాయి. ఒక విధంగా సాయి కొర్రపాటి కార్యాలయం మీద దాడి అన్నది బాహుబలి టీమ్ కు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికగా మారింది.

పైగా బాహుబలి అమ్మాకాలు పూర్తిగా జరగలేదు. అగ్రిమెంట్లు జరిగాయి. అంటే పది శాతం అడ్వాన్స్ . వాటిల్లో కూడా సాయి కొర్రపాటివే ఎక్కువ. సీడెడ్, కృష్ణా, విశాఖ, ఇలా. వాటికి ఇచ్చిన అడ్వాన్స్ లు చాలా అంటే చాలా తక్కువ అని తెలుస్తోంది. ఓవర్ సీస్ అడ్వాన్స్ వచ్చిన వెంటనే పక్కకు వెళ్లిందని వినికిడి.

అయితే లెక్కలు మాత్రం కాస్త తలకాయనొప్పి వ్యవహారం అని తెలుస్తోంది. ఎందుకంటే పార్ట్ వన్ లెక్కలు అయిపోయినా, టూ లెక్కలు ఇంకా వున్నాయి. సినిమా విడుదల, వచ్చే ఏడాది రిటర్న్ లు చాలా దూరం వున్నాయి కాబట్టి, వాటి విషయంలో కాస్త వెనకే వున్నారని తెలుస్తోంది. అవన్నీ ఇప్పుడు సెట్ రైట్ చేస్తున్నారని తెలుస్తోంది.

పైగా బాహుబలి వెనుక ఎవరున్నారు? రాఘవేంద్రరావు.. ఆయన ఇటు చంద్రబాబు నాయుడికి, అటు రామోజీరావుకు అత్యంత హితుడు. సన్నిహితుడు. రామోజీరావు అంటే కేంద్రభాజపాకు అత్యంత కీలకమైన వ్యక్తి. ఇలాంటి నేపథ్యంలో బాహుబలికి తెగే వెంట్రుక ముక్క కూడా ఏమీ వుండదన్నది ఇండస్ట్రీ వర్గాల వ్యాఖ్య.