ఏ సినిమాలు వుంటాయో? ఏవి ఉండవో?

నోట్ల రద్దు వ్యవహారం టాలీవుడ్ పై గట్టిగానే పడింది. ఎప్పటి నుంచో షెడ్యూలు చేసుకుంటూ వచ్చిన సినిమాల విడుదల తేదీలన్నీ అయోమయంలో పడుతున్నాయి. పాత నోట్లు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా వదిలించుకోవాలో…

నోట్ల రద్దు వ్యవహారం టాలీవుడ్ పై గట్టిగానే పడింది. ఎప్పటి నుంచో షెడ్యూలు చేసుకుంటూ వచ్చిన సినిమాల విడుదల తేదీలన్నీ అయోమయంలో పడుతున్నాయి. పాత నోట్లు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా వదిలించుకోవాలో అన్న వ్యవహారంలోనే థియేటర్ల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, నిర్మాతలు వున్నారు. మరోపక్క థియేటర్లకు ఇంకా జనం రావడం అన్నది అంతంత మాత్రంగానే వుంది. 

ఇప్పటికే ఇంట్లో దెయ్యం సినిమా వాయిదా పడింది. 25న షెడ్యూలు చేసిన మన్యం పులి సినిమా కూడా ఓ వారం వెనక్కు వెళ్తోంది. 18 ఎక్కడికిపోతావు చిన్నవాడా, 25న జయమ్ము నిశ్చయమ్మురా మాత్రం విడుదల కావాలని ఫిక్స్ డ్ గా వున్నాయి. నవంబర్ 2న ధృవ విడుదల వుంటుందని పైకి చెబుతున్నారు కానీ, అది కూడా వాయిదా పడుతుందని వినికిడి. 

కనీసం ఒకటి నుంచి రెండు వాయిదా వుండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ధృవ లాంటి భారీ సినిమాకు అడ్వాన్స్ లు కాస్త భారీగానే వుంటాయి. సప్తగిరి ఎక్స్ ప్రెస్ నవంబర్ లోనే వుంటుంది. ధృవ వాయిదా అన్నది ఈ నెలాఖరుకు కానీ తెలియదు. వాయిదా ఖాయం అయితే 2న సప్తగిరి ఎక్స్ ప్రెస్, మన్యంపులి ఫిక్స్ అయిపోతాయి.