పవర్ స్టార్, జనసేన చీఫ్ తలపెట్టిన అనంతపురం సభ జరుగుతుందా? వాయిదా పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ సభ అన్నది అయోమయంలో పడింది. తెరవెనుక సంగతులు ఏమి వున్నా, పవన్ అనంతపురం సభ అన్నది తెలుగు ఆత్మగౌరవం, హోదా, రాయలసీమ వెనుకబాటు తనం పై ఏర్పాటు చేసింది.
తిరుపతి, కాకినాడ సభల్లో పవన్ కళ్యాణ్ ను భాజపాను టార్గెట్ చేసారు. కానీ ఇప్పుడు ఓవర్ నైట్ మోడీ చరిష్మా పీక్ కు చేరిపోయింది. అందువల్ల ఇప్పటికిప్పుడు మోడీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు.
కాకపోతే, ఈ నోట్ల రద్దు అంశాన్ని ఆసరాగా తీసుకుని, అవినీతి రాజకీయాలపై గళం ఎత్తి పరోక్షంగా జగన్ ను టార్గెట్ చేసే అవకాశం అయితే వుంది. కానీ సభ పెట్టిన పర్పస్ వేరు, మాట్లాడేది వేరు అయితే పవన్ పై విమర్శలు వెల్లు వెత్తుతాయి. వీటన్నింటికి తోడు సభకు హాజరయ్యే జనాలకు పెట్రోలు, హోటళ్లలో ఖర్చులు వుంటి వాటికి చిన్న నోట్లు అవసరం పడతాయి. లోకల్ జనసేన క్యాడర్ వాటిని సమకూర్చకపోయినా, అభిమానులయినా ఎవరి డబ్బులు వారు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు వారు ఇబ్బందుల్లో పడతారు.
అందువల్ల ఇవన్నీ ఆలోచించి పవన్ సభను వాయిదా వేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదూ ఆరు నూరైనా సభ జరపాలని పవన్ అనుకుంటే, ఆయన ఈసారి ఏం మాట్లాడతారో కాస్త ఆసక్తికరమే.