ఏమైపోయావయ్యా కన్హయ్యా.? అయినా సోకాల్డ్ విద్యార్థి సంఘ నేతలు, విద్యార్థులు ఎదురుచూస్తున్న ఆయనగారు వచ్చేశాడు. చాలాకాలం తర్వాత జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్ మళ్ళీ తెరపైకొచ్చాడు. ఈసారి కండోమ్‌ల లెక్క కాదు, తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ చెప్పమంటూ సవాల్ విసిరేశాడు. 'బీహార్ టూ తీహార్' అనే పుస్తకాన్ని రాసిన కన్హయ్య, ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆవేశంతో ఊగిపోయాడు. అక్టోబర్ 15 నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి నజీబ్ ఆచూకీ కావాలట కన్హయ్యకి.
'విద్యార్థి నేత' ముసుగులో దేశాన్ని సవాల్ చేస్తున్న కన్హయ్య కుమార్, తీవ్రవాదంపైనా, ఆ తీవ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు గతంలో. ఆ కారణంగానే ఆయనపై దేశద్రోహం కేసు కూడా నమోదయ్యింది. బెయిల్ మీద బయటకొచ్చాక, దేశంలోని వివిధ యూనివర్సిటీల్లోనూ, నగరాల్లోనూ పర్యటించి, బహిరంగ సభలు కూడా నిర్వహించాడీ కన్హయ్య. వామపక్షాలు కన్హయ్య మీద చాలా ఆశలు పెట్టుకున్నాయి.. పొలిటికల్‌గా తమకు మైలేజ్ వస్తుందని.
గతంలో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో కన్హయ్య ప్యాక్టర్ పనిచేస్తుందనీ, ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో కన్హయ్య తమకు ట్రంప్ కార్డ్ అవుతాడని కాంగ్రెస్, వామపక్షాలు భావించి, ఓవరాక్షన్ చేసినా.. నిరాశపడక తప్పలేదు.
ఇక, ఢిల్లీ జేఎన్‌యూలో బీరు బాటిళ్ళు, కండోమ్‌లు, గర్భస్రావం కోసం ఉపయోగపడే ఇంజెక్షన్లు పెద్దయెత్తున చెలామణీ అవుతున్నాయంటూ బీజేపీ నేత ఒకరు చేసిన ఆరోపణలపై కన్హయ్య కామెడీగా స్పందించాడు. 'తప్పిపోయిన విద్యార్థి మాటేమిటి.?' అని ప్రశ్నించాడే తప్ప, 'యూనివర్సిటీల్లో కండోమ్‌లు, గర్భ నిరోధక ఇంజెక్షన్లు, బీరు బాటిళ్ళు ఎందుకు వుంటున్నాయి.?' అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. ఎంతైనా కుర్రాడు కదా, యూనివర్సిటీలో అవన్నీ వుంటే తప్పేంటి.? అన్నది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు.