ధృవ విడుదల ఎప్పుడు..ఇది మెగాభిమానులకు మహా ఆసక్తికరమైన విషయం. డిసెంబర్ 2 అని ఇప్పటి వరకు ఎక్కువగా వినిపిస్తున్న విషయం. అయితే వన వీక్ వెనక్కు వెళ్లే అవకాశాన్ని కూడా యూనిట్ పరిశీలిస్తోందని వార్తలు అందుతున్నాయి. దీనికి సహేతుక కారణం వుందట.
అంటే సినిమా ఇంకా పూర్తికాకపోవడం వంటి కారణాలు కాదు, రెండవ తేదీ కన్నా 9వ తేదీ అయితే ఇంకా బెటర్ అని భావించడమే నట. తొమ్మిది నుంచి వరుసగా అయిదు రోజులు సెలవులో, పండుగల్లాంటివో వస్తున్నాయట. అందువల్ల అప్పుడయితే విడుదల బాగుంటుదని అనుకుంటున్నారట.
పైగా ఇప్పడేమీ పెద్దగా సినిమాలు మిగిలిలేవు. పెద్దగా కాంపిటీషన్ వుండదు. ఒకటి రెండు వుంటే రెండవ తేదీన కూడా దులిపేస్తారు. ఆపై రెండు మూడు వారాలు దున్నేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారట. కానీ మళ్లీ వెనక్కు అంటే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయేమో, రెండునే విడుదల చేసేస్తే బెటర్ అన్న వాదన కూడా వినిపిస్తోంది.