హీరో నిఖిల్ సినిమా మొత్తం మీద విడుదల తేదీకి నోచుకుంది. ఎప్పుడు మొదలైంది..ఎన్ని అవాంతరాలు. ఆఖరికి హమ్మయ్య అంటూ ఓ డేట్ కు ఫిక్సయింది. పైగా అదృష్టం ఏమిటంటే ఈ సినిమా డేట్ కు ముందు వారం, ఆ పైవారం విపరీతమైన పోటీ వుంది. కానీ 18 న మాత్రం డబ్బింగ్ సినిమా భేతాళుడు తప్ప వేరేది లేదు. ఇదో అదృష్టం. కానీ ఇప్పుడు కూడా ఆ సినిమా యూనిట్ సరైన ప్లానింగ్ చేయడం లేదని వినిపిస్తోంది.
డైరక్టర్ ఓ మాట, నిర్మాత మరో మాట, ఇంకో ఇద్దరు కీలక వ్యక్తులు వాళ్ల మాటలు వాళ్లు..ఇలా అన్నమాట. సినిమాకు ఇంతవరకు పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు. హీరో నిఖిల్ కు అంతా బాగానే వుంది. పబ్లిసిటీ కుమ్మేస్తున్నాం అని చెబుతున్నారట. కానీ వాస్తవంలో పరిస్థితి వేరుగా వుందట. నిజానికి ఇప్పుడు నిఖిల్ చాలా కేర్ గా వుండాల్సిన టైమ్. ఎందుకంటే ముందువారం రెండు ఫన్ జోనర్ సినిమాలు, తరువాత వారం రెండు ఫన్ జోనర్ సినిమాలు వున్నాయి. మధ్యలో తన హర్రర్ సినిమా వదుల్తున్నాడు.
దానికి కూడా బిచ్చగాడుతో తెలుగునాట కాస్తయినా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ భేతాళుడు తో పోటీ వుంది. అది కూడా ఇదే హర్రర్ జోనర్ గా కనిపిస్తోంది. ఇలాంటపుడు సరైన ఓపెనింగ్స్, రన్నింగ్ కు సాయం చేసేది పబ్లిసిటీనే. దాన్ని వదిలేసుకుంటే కష్టం. ఆ మధ్య నాని మజ్ఞు సినిమాకు ఇదే జరిగింది. మరి నిఖిల్ ఈ విషయంలో ఏం చేస్తాడో?