మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం.. అలాంటి స్ట్రెస్ ఏమీ లేకుండా హ్యాపీగా ఉండటం… ఈ రెండు విషయాల మధ్య మనసును ప్రభావితం చేయడంలో మీ పని, మీ కుటుంబం, మీ పరిస్థితులు మాత్రమే కాదు.. ఈ మూడ్స్ ను ప్రభావితం చేసే శక్తి సూర్యుడికి కూడా ఉందని అంటున్నారు పరిశోధకులు. కాస్త సూర్యుడిని నమ్ముకోండి.. ఆయన మానసిక ప్రశాంతతను ఇస్తాడని కూడా వీరు భరోసా ఇస్తున్నారు.
ఉదయం పూట కాసేపు లేలేత భాను కిరణాలు పడేలా చూసుకుంటే… శరీరానికి అవసరమైన డీ విటమిన్ అందుతుందని వైద్యులు, అధ్యయనకర్తలు సలహా ఇస్తూ ఉంటారు. అంతే కాదు… కేవలం విటమిన్లే కాదు.. సూర్యరశ్మి శరీరాన్ని తాకడం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
తగిన స్థాయిలో సూర్యరశ్మి శరీరానికి తగిలినప్పుడు మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ స్టేబుల్ గా ఉంటుందని ఈ అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఈ విధంగా సూర్య కిరణాలు మానసిక ప్రశాంతతను అందిస్తాయని అంటున్నారు. గోరు వెచ్చని సూర్యుడి కిరణాలు శరీరానికి తగలడం మానసిక ఆరోగ్యానికి ఒక వైద్యమని వీరు వివరిస్తున్నారు.