పవన్…. ఎంత స్పీడందుకున్నారు

సర్దార్ గబ్బర్ సింగ్ టైమ్ కు ఇప్పటికి ఎంత తేడా? మూడ్ వచ్చినపుడే షూట్..లేనపుడు లేదు అన్న రీతిలో సాగింది గబ్బర్ సింగ్ షూట్. ఏ నిర్ణయమూ అంత త్వరగా తీసుకోలేదు. డైరక్టర్ ను…

సర్దార్ గబ్బర్ సింగ్ టైమ్ కు ఇప్పటికి ఎంత తేడా? మూడ్ వచ్చినపుడే షూట్..లేనపుడు లేదు అన్న రీతిలో సాగింది గబ్బర్ సింగ్ షూట్. ఏ నిర్ణయమూ అంత త్వరగా తీసుకోలేదు. డైరక్టర్ ను మార్చడం దగ్గర నుంచి మిగిలిన అన్ని విషయాలు కూడా. కానీ ఇప్పుడు పవన్ చకచకా వ్యవహరిస్తున్నారు. రెండు సినిమాల ముహర్తాలు చేసేసారు కాబట్టి ఇలా అనుకుంటున్నారేమో అన్న అనుమానం అక్కరలేదు. నిజంగానే పవన్ స్పీడ్ అయ్యారు. సబ్జెక్ట్ లు మూడు ఒకేసారి ఒకె చేసి వుంచారు. రెండు రీమేక్ లు. ఒకటి స్ట్రయిట్. 

నిర్మాతల ఆబ్లిగేషన్ మేరకు పూజలు కానిచ్చేసి వుండొచ్చు. కానీ వేటి డేట్ లు వాటికి ఫిక్స్ చేసి వుంచారన్నది వాస్తవం. త్రివిక్రమ్ సినిమాకు నవంబర్ నుంచి డేట్ లు ఇచ్చి మళ్లీ మనసు మార్చుకుని, డిసెంబర్ కు వాయిదా వేసారు. ఈ లోగా చేతిలోని డాలీ డైరక్షన్ లోని సినిమాను మాగ్జిమమ్ ఫినిష్ చేయాలని డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు. పవన్ ఇలా డే అండ్ నైట్ షూట్ చేసి చాలా కాలం అయింది. ఒక విధంగా కాటమరాయుడుకి తెరవెనుక కర్త కర్మ క్రియ పవన్ నే. మరి ఆ సినిమానే ఇంత చకచకా కానిస్తున్నారంటే, కేవలం ఏక్టింగ్ తప్ప మరేదీ పట్టించుకోనక్కర లేని త్రివిక్రమ్ సినిమాను కూడా చకచకా కానిచ్చేయడానికి చాన్స్ వుంది. 

అంటే పవన్ ఇదే స్పీడ్ తో వెళ్తే, విడుదల సంగతి ఎలా వున్నా, 2017లో మొత్తం మూడు సినిమాలు ఫినిష్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాత పవన్ దగ్గర వున్న కమిట్ మెంట్ లు మహా అయితే ఒకటి లేదా రెండే వుంటాయి. అసలు పవన్ ఇంత స్పీడ్ కావడానికి కారణం, సినిమాల ప్రేమేనా లేక ఇంకేమన్నానా? ఒకటి ఫైనాన్షియల్ గా పవన్ స్ట్రాంగ్ అవుతారు. దాదాపు అయిదు సినిమాలు అంటే దగ్గర దగ్గర ఎలా లేదన్నా దగ్గర దగ్గర వంద కోట్లు. అదే సమయంలో ఎన్నికలు దగ్గరపడే సమయానికి తన ఇమేజ్ ను మరింత పెంచుకోవడం. అన్నింటికి మించి 2018నాటికి పొలిటికల్ ఎరీనా మీదకు రావడానికి తన టైమ్ ను ఖాళీగా రెడీ చేసి పెట్టుకోవడం. 

ఇలా మల్టీ లక్ష్యాలు పెట్టుకుని పవన్ స్పీడందుకున్నట్లుంది మరి.