ఇజమ్ కు ముందే దర్శకుడు పూరి జగన్నాధ్ తో హీరో నాగశౌర్య భేటీ జరిగింది. ఇద్దరు కలిసి సినిమా చేయాలని అనుకున్నారు అప్పట్లో. ఇజమ్ తరువాత దర్శకుడు పూరి జగన్నాధ్ కు నాగశౌర్య మాత్రమే ఆప్షన్ అని వినిపించింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అని తెలుస్తోంది.
నాగశౌర్య ప్రస్తుతం వారాహి సంస్థ కోసం ఓ థ్రిల్లర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దాని తరువాత నిర్మాత కేకే రాధామోహన్ కోసం ఓ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభిస్తాడు. దాని తరువాత సుకుమార్ నిర్మాతగా ఓ సినిమా చేయాల్సి వుంది. ఇదిలా వుంటే పూరి కూడా వేరే ఆప్షన్లు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా హీరో రామ్ తో సినిమా ఒకటి డిస్కషన్ లో వున్నట్లు వినికిడి. మొత్తం మీద యంగ్ హీరో నాగశౌర్యతో మాత్రం పూరి సిన్మా లేనట్లే అని తెలుస్తోంది.