ఒక బ్యానర్ ఒకే డైరక్టర్ తో వరుసగా సినిమాలు చేయడం. ఇప్పటికి ఇది నాలుగోది. ఇదంతా హారిక హాసిని సంస్థ గురించే. ఈ సంస్థ జులాయితో తన జర్నీ ప్రారంభించింది. ఆపై సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు నాలుగో సినిమాగా పవన్ తో ముహుర్తం చేసారు. ఈ నాలుగు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే డైరక్టర్ అని కొత్తగా చెప్పనక్కరలేదు.
హారిక హాసిని సంస్థ బ్యానర్ లో సినిమా అంటూ చేస్తే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లోనే. వేరే సినిమాల కోసమే రెండోబ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ స్టార్ట్ చేసారు. ఇలా ఓ డైరక్టర్ కోసం ఓ బ్యానర్ ను అలా కేటాయించి వదిలేయడం అంటే నిర్మాత డైరక్టర్ ల మధ్య మంచి స్నేహమో, అంతకు మించిన బంధమో వున్నట్లే అనుకోవాలి.
ఈ సంస్థ లేటెస్ట్ సినిమాకు ఈ రోజు పూజ నిర్వహించారు. పవన్ హీరోగా నటించే ఈ సినిమా డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. స్క్రిప్ట్ రెడీ అయింది కానీ, ఇంకా స్టార్ కాస్ట్ ఫైనల్ కాలేదు. అదంతా కూడా త్రివిక్రమ్ ఎలా అంటే అలానే..నిర్మాత చినబాబుది కేవలం పెట్టుబడి మాత్రమే. హారిక హాసిని అంటే త్రివిక్రమ్ స్వంతబ్యానర్ అనేసుకోవాలేమో?
ఇదిలా వుంటే అ..ఆ సినిమాకు తొమ్మిది కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారు త్రివిక్రమ్. మరి ఈ సినిమాకు అన్నీ కలిపి 12 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.