ఒక్కొసారి సక్సెస్ కూడా పెద్ద ప్రతిబంధకంగా మారుతుంది. అ..ఆ సినిమా కూడా హీరో నితిన్ కు అలాగే మారింది. ఆ సినిమా సక్సెస్ తరువాత మళ్లీ ఆ రేంజ్ సినిమా చేయాలని కిందా మీదా అయ్యారు. తెగ ఆలోచించారు. ఆ సినిమా కు ముందు అనుకున్న డైరక్టర్లను అందరినీ పక్కన పెట్టారు.
కానీ ఏ ప్రాజెక్టు కూడా సెట్ కాలేదు. ఆఖరికి హను రాఘవపూడితో సినిమా సెట్ అయింది. అయినా కూడా సెట్ మీదకు వెళ్లడానికి ఇంకో నెలయినా పడుతుందట. అంటే అ ఆ విడుదలై ఆర్నెల్ల పాటు నితిన్ ఖాళీగా వున్నాడన్నమాట. దీంతో వాస్తవానికి నవంబర్ నుంచి చేయాలనుకున్న నితిన్-నిర్మాత రాధామోహన్ కాంబినేషన్ ఆర్నెల్లు వెనక్కుపోతోంది.
హాయిగా మిడిల్ రేంజ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నితిన్ ను అ..ఆ సక్సెస్ అయోమయంలో పడేసినట్లుంది. అయినా అ..ఆ సక్సెస్ నితిన్ ది అనుకోవడం కన్నా త్రివిక్రమ్ ది అని అనుకుని వుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో?