నిశ్చితార్ధం కూడా జరిగిన తర్వాత త్రిష పెళ్లి కాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. దాని గురించి మాట్లాడకుండా, తనకొచ్చిన ఆఫర్లతో బిజీగా ఉంటోన్న త్రిషకి ఫైనల్‌గా 'కోడి' (తెలుగులో ధర్మయోగి) చిత్రంతో ఊరట లభించింది. ఈ సినిమా కానీ అటు, ఇటు అయినట్టయితే త్రిషకి ఆఫర్లు తగ్గిపోయేవేమో.
ఈ చిత్రం విజయం సాధించడమే కాకుండా త్రిష నటనకి అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో ఆనందంగా కనిపిస్తోన్న త్రిష పెళ్లి మాట ఎత్తితే, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చేసింది. తనకి నటిగా కొనసాగాలని వుందని, చనిపోయే వరకు నటిస్తూనే ఉంటానని, అందుకు సమ్మతించిన వాడినే చేసుకుంటానని చెప్పింది.
నటిగా కొనసాగడానికి ఒప్పుకోనందుకే ఆ పెళ్లి కాన్సిల్ చేసుకున్నానని, ప్రెగ్నెంట్ అయినపుడు కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటానే తప్ప లేదంటే నటిస్తూనే ఉంటానని, హీరోయిన్ వేషాలు అయిపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతానని త్రిష ఖచ్చితంగా చెప్పేసింది. రేపో మాపో రిటైర్ అయిపోతుందేమోనని బెంగపడే అభిమానులకి ఇది శుభవార్తే సుమీ.