గౌతమ్ మీనన్ – బెల్లంకొండ

పూరి జగన్నాధ్,  రామ్ గోపాల్ వర్మ వీళ్లంతా తెలివైన బద్ధకస్తులు అనిపిస్తుంది. మరీ ఎక్కువ శ్రమ పడకుండా ఏదో ఒకటి చేస్తూ ముందుకు వెళ్లిపోయే పనిలో పడ్డారు కచ్చితంగా అనుకుంటారు ఎవరైనాసరే వాళ్లు తీస్తున్న…

పూరి జగన్నాధ్,  రామ్ గోపాల్ వర్మ వీళ్లంతా తెలివైన బద్ధకస్తులు అనిపిస్తుంది. మరీ ఎక్కువ శ్రమ పడకుండా ఏదో ఒకటి చేస్తూ ముందుకు వెళ్లిపోయే పనిలో పడ్డారు కచ్చితంగా అనుకుంటారు ఎవరైనాసరే వాళ్లు తీస్తున్న సినిమాలు చూస్తుంటే. గౌతమ్ మీనన్ కూడా వీళ్ల తరహానే కానీ సినిమాలు సిన్సియర్ గా తీయడానికి ప్రయత్నిస్తాడు. 

అయితే కేవలం సృజన వరకు తను చూసుకోకుండా, ఆ వ్యాపారంలో కూడా వేలు పెట్టడంతో కిందా మీదా అయిపోతుంటాడు, సినిమాలు సకాలంలో విడుదల కాక సమస్యలు వస్తాయి. అయినా కూడా పూరి, వర్మ, గౌతమ్ మీనన్ తో సినిమాలు చేయాలనుకునే హీరోలు వుండనే వుంటారు. 

అయితే ఆ హీరోల రేంజ్ నే ఒకటి నుంచి పదికి మెల్లగా దిగుతూ వస్తుంటుంది. వెంకీ లాంటి టాప్ హీరో నుంచి నాగ్ చైతన్య, నాని ల మీదుగా వస్తున్నాడు గౌతమ్ మీనన్. ఆ మధ్య సాయిధరమ్ తేజతో సినిమా అన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మరి దీనికి నిర్మాతగా బెల్లంకొండ సురేష్ వుంటారా? లేక ఎప్పటిలాగే తెరవెనుకే వుంటారా అన్నది చూడాల్సి వుంది.