ఏదో అమెరికన్ టీవీ షోల్లో అవకాశాలు.. వచ్చే సరికి అప్పుడే ప్రియాంక చోప్రాకు ఇండియాపై, బాలీవుడ్ పై చిన్న చూపు మొదలైనట్టుగా ఉంది! అక్కడ ఒళ్లు దాచుకోకుండా.. హాట్ ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ సంపాదించుకుంటున్న ప్రియాంక.. ఒక అమెరికన్ టీవీ ఛానల్ టాక్ షోలో అనుచితమైన మాటలే మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఒక బాలీవుడ్ మూవీ మేకర్ ప్రియాంక తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమె ఫీలవ్వాల్సిన అవసరం లేదు, హిందీ సినిమా కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు, ఆమె అవసరం బాలీవుడ్ కు లేదు అని స్పష్టం చేశాడు.
ఇంతకీ ప్రియాంక ఏమన్నదంటే.. తను వీకెండ్స్ లో ఇండియా వెళ్తాను అని, తన పెండింగ్ వర్క్ ను అలా పూర్తి చేస్తున్నాను అని ఆమె చెప్పింది. అలాగే “ ఇండియా లో వీకెండ్ కాన్సెప్ట్ అంటూ ఏమీ లేదు..’’ అంటూ అదో గొప్ప వర్క్ కల్చర్ అయినట్టుగా ప్రియాంక మాట్లాడింది. తను వారాంతాల్లోనూ కష్టపడుతున్నాను అన్నట్టుగా కాకుండా, బాలీవుడ్ ను వదిలించుకోవడానికి పని చేస్తున్నా అన్నట్టుగా ప్రియాంక మాట్లాడటమే ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఎంత అమెరికాలో అవకాశాలు సంపాదిస్తే మాత్రం.. అప్పుడే ఇలాంటి సన్నాయి నొక్కుళ్లు ఎందుకో.. అంటూ ఇప్పుడు బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. దీనిపై ఒక మూవీ మేకర్ ఘాటుగా స్పందించాడు. “నాకు తెలిసి..బాలీవుడ్ వరకూ ప్రియాంక పూర్తి చేయాల్సిన సినిమాలేవీ లేవు. మరి ఆమె దేని గురించి మాట్లాడుతోందో అర్థం కావడం లేదు. ఆమె తన ఆసక్తి మేరకు అమెరికాలోనే అవకాశాలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే.. ఆమె అవసరం బాలీవుడ్ కు ఏమీ లేదు.. ఆమె లేకుండా కూడా ఇండియన్ సినిమా మనుగడ సాగించగులుగుతుంది..’’ అంటూ ఆయన పీసీకి గట్టి సమాధానమే ఇచ్చాడు.