న్యూడిటీ మామూలైపోతుందా.?

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ, బికినీ గ్లామర్‌ గురించి, సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌ గురించీ, న్యూడిటీ గురించీ.. పాత మాటల్నే కొత్త కొత్తగా చెబుతోంది. 'సినిమా అంటే గ్లామర్‌, ఆ గ్లామర్‌కి హద్దుల్ని నిర్ణయించలేం.. ఏ…

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ, బికినీ గ్లామర్‌ గురించి, సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌ గురించీ, న్యూడిటీ గురించీ.. పాత మాటల్నే కొత్త కొత్తగా చెబుతోంది. 'సినిమా అంటే గ్లామర్‌, ఆ గ్లామర్‌కి హద్దుల్ని నిర్ణయించలేం.. ఏ సినిమా చేసినా మమ్మల్ని కొత్తగా చూడాలనుకుంటారు.. ఆ కొత్తదనం కోసం రకరకాల కాస్ట్యూమ్స్‌ని ధరించాల్సి వస్తుంది.. అందులో కొన్ని హాట్‌గా వుంటాయి.. ఇంకొన్ని చాలా చాలా హాట్‌గా వుంటాయి.. అంతిమంగా అది గ్లామర్‌ మాత్రమే..' అంటూ సెలవిచ్చింది అనుష్క శర్మ. 

సినీ రంగంలో కొత్తగా అడుగుపెట్టిన సమయంలో గ్లామరస్‌గా కనిపించడమంటే అదో బిగ్‌ టాస్క్‌ అనుకుదాన్నననీ, తనలాంటి ఆలోచనలతో వచ్చిన చాలామంది హీరోయిన్లు, తర్వాత్తర్వాత గ్లామరస్‌ హీరోయిన్లుగా వెలిగిపోయిన తీరు తన ఆలోచనల్ని మార్చేసిందని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. తనవరకూ ఐశ్వర్యారాయ్‌ని బాగా ఇష్టపడ్తాననీ, 'ఆయే దిల్‌ హే ముష్కిల్‌' సినిమాలో ఐశ్వర్య గ్లామర్‌ చూశాక, ఇంకెవరూ గ్లామర్‌ విషయంలో ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏ హీరోయిన్‌నీ వెయ్యకపోవచ్చేమోనని అనుష్క అభిప్రాయపడింది. 

ఇండియన్‌ సినిమా హాలీవుడ్‌ స్థాయికి ఎదుగుతున్న క్రమంలో, న్యూడిటీని సైతం మన ప్రేక్షకులు అంగీకరించే రోజులొస్తాయని అనుష్క వ్యాఖ్యానించడం గమనార్హం. సెన్సార్‌ బోర్డ్‌ ఒప్పుకుంటుందా.? అంటే, ఒకప్పుడు లిప్‌ కిస్‌ని సెన్సార్‌ ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటోంది కదా.. అని సమాధానమిచ్చింది అనుష్క శర్మ.