ఆ కధేం చేస్తున్నారు చందూ?

ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు చందు మొండేటి. కార్తికేయ సినిమా తరువాత నాగ్ పిలిచి మరీ చైతూతో సినిమా చేయమన్నాడు. అందుకోసం చందు మంచి కథ తయారు చేసుకున్నాడు. అది ఇటు…

ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు చందు మొండేటి. కార్తికేయ సినిమా తరువాత నాగ్ పిలిచి మరీ చైతూతో సినిమా చేయమన్నాడు. అందుకోసం చందు మంచి కథ తయారు చేసుకున్నాడు. అది ఇటు నిర్మాత చినబాబుకు, నాగ్, చైతూ అందరికీ సూపర్ గా నచ్చేసింది. కానీ అప్పుడే ప్రేమమ్ విడుదలైంది. అందరి దృష్టిని ఆ సినిమా ఆకర్షించింది. కాస్త మొహమాటపడుతూనే చందు ఆ ప్రాజెక్టు టేకప్ చేసాడు. 

మరి అప్పటికి పూర్తిగా రెడీ అయి, ఓకె అయిన స్క్రిప్ట్ అలాగే వుంది. నాగ్ చైతన్యకు నచ్చిన స్క్రిప్ట్. మరి, దాన్ని ఏం చేస్తాడు చందు? త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు. కానీ ఆ కథ, దాని వ్యవహారాలు వేరు కావచ్చు. ఎందుకంటే చైతూ ఈ కథను అలాగే తన కోసం వుంచేయమని కోరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే, మరోసారి చైతూ-చందు కాంబినేషన్ లో సినిమా వుంటుదని అనుకోవచ్చు.