ఖైదీ నెంబర్ 150 కోసం రాత్రికి రాత్రి చెన్నయ్ నుంచి పరుగు పరుగున వచ్చేసింది లక్ష్మీరాయ్. మెగాస్టార్ సరసన, లారెన్స్ మాస్టర్ డ్యాన్స్ డైరక్షన్ లో అయిటమ్ సాంగ్ చేసేసింది. దీనికి గాను, ఆమెకు కాస్త చెప్పుకోదగ్గ మొత్తమే చేతిలో పడింది. జస్ట్ 40 లక్షలు. తమన్నా, కాజల్ మాదిరిగా అయిటమ్ సాంగ్ కు కోట్లు తీసుకోకపోయినా, నలభై లక్షలు తక్కువ బిల్లు ఏమీ కాదు.
ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు సినిమా మొత్తానికి ఆ మేరకు చార్జ్ చేయడం లేదు. అంతెందుకు రాశీ ఖన్నీ ఇంకా ఆ రేంజ్ కు చేరలేదు. ధృవ ఒప్పుకునే సరికి రకుల్ కు యాభై లక్షలే. అందువల్ల లక్ష్మీరాయ్ కు ఒక్క పాటకు నలభై లక్షలు అంటే మంచి గిట్టుబాటు అనే చెప్పుకోవాలి.