Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ రా బుజ్జీ

డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ రా బుజ్జీ

తివిక్రమ్ సినిమాలో డైలాగే ఇది..ఆడు మగాడ్రా బుజ్జీ..అని వీర పాపులర్ ఆ డైలాగ్. ఇప్పడు త్రివిక్రమ్ చుట్టూ తిరుగుతున్న సినిమా వార్తల వైనం చూస్తే డైరక్టర్ అంటే త్రివిక్రమ్ రా బుజ్జీ అనేలా వుంది వ్యవహారం. పవన్ సినిమా ముందో, వెనుకో, బ్యానర్ ఏదయినా సరే, త్రివిక్రమ్ తో సినిమా ఓకె చేయించుకోవాలని హీరో ఎన్టీఆర్ కిందా మీదా అవుతున్నారట. ఆయన ఇంట్లోనే వున్నారు.

కానీ ఆయన తరపున లాబీయింగ్ మాత్రం సీరియస్ గా సాగుతోందని వినికిడి. ఎలాగైనా త్రివిక్రమ్ చేత, ఓకె అనిపించి, అనౌన్స్ మెంట్ ఇవ్వాలని ఎన్టీఆర్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  ఒక పక్కన అనిల్ రావిపూడి గుడ్డివాడి కథతో రెడీగా వున్నాడు. మరోపక్క పూరి తన కథ పట్టుకుని సిద్ధంగా వున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమో..త్రివిక్రమో అంటున్నారు. 

కానీ సదరు త్రివిక్రమ్ ఒకపక్క పవన్ కు కమిట్ అయి వున్నారు. మరోపక్క మహేష్ కు కమిట్ అయి వున్నారు. నిర్మాతలుగా హారిక హాసిని, మైత్రీ మూవీస్ ఫిక్స్ అయిపోయాయి. వీటన్నింటికి అదనంగా దానయ్య అడ్వాన్స్ ఒకటి వుంది. మరి అదెప్పుడో? ఎవరితోనో?  

ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా ఎక్కడ ఇరికిస్తారు త్రివిక్రమ్? అదంతా కాదు, ఎప్పడో అప్పుడు, చేస్తా అని ప్రకటిస్తే చాలు అంటున్నాయట ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు. మరి ఓ డైరక్టర్ కోసం ఓ టాప్ హీరో తరపున ఇంతలా లాబీయింగ్ జరుగుతోంది అంటే, డైరక్టర్ అంటే త్రివిక్రమ్ రా బుజ్జీ అనుకోవడంలో తప్పు లేదు కదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?