కొడుకును హీరోగా చూసుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు కు, అంతకు మించి ఆయన శ్రీమతికి కోరిక. కానీ సరైన సబ్జెక్ట్ సెట్ కావడం లేదు.
మారుతి డైరక్షన్ లో కుర్రాడ్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నారు. కానీ వీలు పడలేదు. దగ్గుబాటి సురేష్ కు అప్పగిస్తే, ఆయనేమో, ప్రస్తుతం సినిమాలు లేకుండా ఖాళీగా వున్న జయంత్ సి పరాన్జీ చేతిలో పెట్టారు.
తండ్రి, మామగారు ఇద్దరు మంచి బిజినెస్ మెన్ లు అయి వుండీ, ఆర్థికంగా బలమైన వారై వుండి కుర్రాడ్ని ఇలా వదిలేయడం ఏమిటో అని జనం చెవులు కొరుక్కున్నారు. అది వేరే సంగతి.
తీరా చేస్తే, ఇప్పుడు జయంత్ సి పరాన్జీ తో చేయాల్సిన సినిమాకు కూడా బ్రేక్ పడిందని తెలుస్తోంది. జయంత్ తో సినిమా పెద్దగా ఇష్టం లేదో, లేక ఆయన తెచ్చిన సబ్జెక్ట్ నచ్చలేదో, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును కాస్త ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. మరో మంచిది, సరైన సబ్జెక్ట్ కోసం గంటా వెదుకుతున్నారు. అది దొరికితే ముందుగా దాన్ని పట్టాలు ఎక్కించాలన్నది ఆలోచనగా వుంది.
ఏమైనా అందరూ బెల్లంకొండ సురేష్, కుమారస్వామి గౌడ మాదిరిగా తెగించి కుర్రాళ్లను హీరోలుగా చేయడానికి కోట్లు కుమ్మరించలేరేమో? కెపాసిటీ వున్నా కూడా.