మెగాస్టార్ 150 వ సినిమా నుంచి కేథరిన్ తప్పుకుంది. దీని వెనక వున్న కారణాలపై అనేక గుసగుసలు వున్నాయి. వాస్తవానికి అయిటమ్ సాంగ్ చేయడం కేథరిన్ కు పెద్దగా ఇష్టం లేదని, డేట్ లు అడ్జస్ట్ కారణంతో తప్పుకుందని కొందరు, చిరు కుమార్తెతో తేడా రావడంతో తప్పించారని కొందరు, ఇలా రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే లెటెస్ట్ గుసగుస ఇంకోటి వినవస్తోంది. సహజంగానే కేథరిన్ కు కాస్తే ఏటిట్యూడ్ ఎక్కువ. ఎవర్నీ కేర్ చేయడం అన్నది తక్కువ అని వినికిడి. మాట పడడం కానీ, మాట వినడం కానీ తక్కువ అని ఇండస్ట్రీ టాక్.
ఈ విషయాన్ని వాడుకుని, డ్యాన్స్ డైరక్టర్ లారెన్స్ తెలివిగా కేథరిన్ ను రెచ్చగొట్టారని, దాంతో ఆమె వాదనకు దిగడంతో తప్పించారని ఓ గుసగుస వినిపిస్తోంది. దీనికి కారణం లారెన్స్ కు తనకు ఇష్టమైనా లక్ష్మీరాయ్ ను సాంగ్ లోకి తీసుకోవాలని వుండడమే అని ఇండస్ట్రీలో వదంతి వినిపిస్తోంది.
కేథరిన్ తో సమస్య ముదరి, ఆమెను వద్దనుకున్న మరుక్షణం, లారెన్స్ లక్ష్మీరాయ్ ను ప్రవేశపెట్టారని అంటున్నారు. ఎంతవరకు నిజమన్నది కేథరిన్ కు, మెగాస్టార్ 150వ సినిమా యూనిట్ కు తెలియాలి.