Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'ఆ పనిలో' ఎన్టీఆర్ బిజీ

'ఆ పనిలో' ఎన్టీఆర్ బిజీ

జనతా గ్యారేజ్ సినిమాతో అటు నిర్మాతలకు, ఇటు దర్శకులకు మరో మంచి మాస్ చాయిస్ ప్లస్ 70 కోట్ల బిజినెస్ ఆప్షన్ గా కనిపించాడు ఎన్టీఆర్. అయితే నిర్మాతలు రెడీగా వున్నారు కానీ, డైరక్టర్లే కనిపించడం లేదు.

పూరితో సినిమా చేస్తే మళ్లీ 40 కోట్ల రేంజ్ కు దిగిపోవాల్సి వస్తుందన్న భయం. కళ్యాణ్ రామ్ తో పూరి సినిమా చేస్తే 20 కోట్ల బిజినెస్ కష్టమైన పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది.

ఇలాంటి టైమ్ లో ఓ సినిమా ఎలాగైనా త్రివిక్రమ్ డైరక్షన్ లో చేయాలన్నది ఎన్టీఆర్ ఆలోచన. అందుకు అనుగుణంగా త్రివిక్రమ్ ను ముందు ఒప్పిస్తే, నిర్మాత ఎవరన్నది తరువాత చూడవచ్చని అనుకుంటున్నారు.

ఇప్పుడు చేస్తారా? వచ్చే ఏడాది చేస్తారా? పవన్, తరువాతనా? ముందా? ఇలా అన్నీ పక్కన పెట్టి, ముందు తారక్-త్రివిక్రమ్ ల సినిమా వుంటుంది అనే అనౌన్స్ మెంట్ అయితే చేయించే దిశగా ఎన్టీఆర్ తన ప్రయత్నాలు తాను ప్రారంభించాడట. ఆ తరువాత ఏ సినిమా ప్రకటన అయినా అని వినికిడి. ప్రకటన చేసుకునేందుకు త్రివిక్రమ్ ఒకె అంటే చాలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త వినిపిస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?