ప్రేమమ్ ప్రమోషన్ విషయంలో తప్పు చేస్తున్నారా?

ప్రేమమ్ కు మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. సూపర్ హిట్ టాక్ వచ్చింది. సెలవులు కలిసి వచ్చాయి. హీరో నాగ్ చైతన్య ఎంతవరకు పుల్ చేయగలడో అంతా చేసాడు. కానీ తీరా సెలవులు అయిపోగానే…

ప్రేమమ్ కు మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. సూపర్ హిట్ టాక్ వచ్చింది. సెలవులు కలిసి వచ్చాయి. హీరో నాగ్ చైతన్య ఎంతవరకు పుల్ చేయగలడో అంతా చేసాడు. కానీ తీరా సెలవులు అయిపోగానే సినిమా కలెక్షన్లు డల్ అయ్యాయి. ముఖ్యంగా నాన్ అర్బన్ ఏరియాల్లో సినిమా హాళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

నిజానికి  అంతగా జారిపోవాల్సిన రేంజ్ సినిమా కాదు. బి సి సెంటర్లకు కూడా కాస్త పట్టే ఎంటర్ టైన్ మెంట్ వుంది. కానీ విశాఖ, విజయవాడ, హైదరాబాద్ ల్లో ఫేర్ చేసినట్లు మిగిలిన ఏరియాల్లో చేయడం లేదు. ఇప్పటికి బయ్యర్లకు 60శాతం వరకు వచ్చింది. ఇంకా నలభై శాతం ప్లస్ ఖర్చులు రావాలి. అంటే విగరస్ గా ప్రమోట్ చేయాల్సి వుంది. 

టీవీ ఇంటర్వూలు, ప్రోగ్రామ్ లు, సక్సెస్ మీట్ లు, ఇంకా చాలా చాలా. కానీ ఆ విషయంలో ఎందుకో యూనిట్ వర్గాలు అంత హుషారుగా పనిచయడం లేదనిపిస్తోంది. తొలివారం లో సక్సెస్ మీట్ అనుకున్నారు కానీ మలి వారానికి వాయిదా వేసారు. కానీ ఈ లోగా టీవీ షోలో, లేదా ఇంటర్వూలో, ఆఖరికి కనీసం విజయవాడ, విశాఖ లాంటి ప్రాంతాల్లో హడావుడో ఏదైనా చేసి, సినిమాకు మరింత జోష్ తెప్పించి వుండాల్సింది. 

నాగ్ చైతన్య ట్రాక్ రికార్డు ప్రకారం క్రౌడ్ పుల్లింగ్ కు అవకాశం తక్కువ. అయినా సినిమాకు వచ్చిన బజ్ వల్ల ఇంతవరకు సాధ్యమైంది. ఇంతకన్నా ముందుకు వెళ్లాలంటే, యూనిట్ మరి కాస్త హడావుడి చేయాలి. అదే కనిపించడం లేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, హారిక హాసిని సంస్థలో కీలక బాధ్యతలు పోషించే ఒకరికి పబ్లిసిటీ డిజైనింగ్ పై అంతగా ఆసక్తి తక్కువని, అందుకే అ..ఆ, బాబుబంగారం, సినిమాలను కూడా అలాగే వాటి టాక్ కు వాటిని వదిలేసారని ఆ యూనిట్ తో పరిచయం వున్నవారి మాట. 

అ..ఆ అంటే బయ్యర్లు సేఫ్ అయ్యారు. బాబు బంగారం కూడా ఆరంభంలో ఎలా వున్నా, చివరకు వచ్చేసరికి కమిషన్లు కూడా వచ్చాయి. మరి ప్రేమమ్ విషయంలో కూడా అలా జరగాలంటే మరి కాస్ జాగ్రత్తలు తీసుకోవాలి.