Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పనామా పేపర్స్ నేపథ్యంలో ఇజమ్?

పనామా పేపర్స్ నేపథ్యంలో ఇజమ్?

కాంటెపరరీ ఇష్కూలను టచ్ చేయడం అంటే దర్శకుడు పూరి జగన్నాధ్ కు చాలా ఇష్టం. గతంలో ఇలా రెండుమూడు సినిమాలు చేసాడాయన. మళ్లీ ఇప్పుడు మరో ప్రయత్నంగా ఇజమ్ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య బయటపడిన పనామా పేపర్స్, బోగస్ కంపెనీలు, ఇలాంటి వాటి నేపథ్యంలో కథ రాసుకుని, ఓ జర్నలిస్ట్ ఇండియా నుంచి బయల్దేరి మూలాల్లోకి వెళ్లి శొధించినట్లు సినిమా తయారుచేసారు. అదే ఇజమ్.

ఇజమ్ సెన్సార్ నిన్న పూర్తయింది. అన్ని సినిమాల మాదిరిగానే షరా మామూలుగా యు/ఎ వచ్చింది. సినిమా క్లయిమాక్స్ లో టెంపర్ మాదిరిగానే 20 నిమషాల కోర్టు సీన్ వుంటుంది. అది చాలా బాగా వచ్చిందని సెన్సార్ టాక్. కేవలం సిక్స్ ప్యాక్ మాత్రమే కాకుండా, ఈ కోర్టు సీన్ ను కూడా కళ్యాణ్ రామ్ బాగా చేసినట్లు చెబుతున్నారు.

పూరి జాగ్రత్త

ఇదిలా వుంటే దర్శకుడు పూరికి ఈ సినిమా మనుటయా..మరణించుటయా అ    నే టైపు. ఎందుకంటే ఈ సినిమా హిట్ మీదే ఆయన కెరీర్ ఆధారపడి వుందన్నది వాస్తవం. అందుకే చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఓ సారి పినిష్ చేసాక, మళ్లీ అటు చూడని అలవాటున్న పూరి జగన్నాధ్ ఈ సినిమాను నాలుగు సార్లు చూసి, మళ్లీ మళ్లీ ఎడిట్ చేసాడట. రెండున్నర గంటలకు పైగా వచ్చిన నిడివిని కోసి, కోసి రెండు గంటల ఎనిమిది నిమషాలకు తీసుకువచ్చారు. ఈ జాగ్రత్తల నేపథ్యంలో సినిమా ఎలా వుంటుదో మరి..చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?