అటు ఖైదీ నెంబర్ 150, ఇటు గౌతమీ పుత్ర శాతకర్ణి. రెండు ప్రెస్టీజియస్ సినిమాలు సంక్రాంతికి విడుదల కావడానికి ముహుర్తాలు డిసైడ్ చేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు తన లేటెస్ట్ సినిమా శతమానం భవతి ని అప్పుడే విడుదల చేయాడానికి ఫిక్స్ అయ్యాడు. రెండు భారీ సినిమాల నడుమ ఈ ఫ్యామిలీ లేగదూడ అన్నమాట.
రచయిత సతీష్ వేగ్నిశ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మరో బ్రహ్మోత్సవం టైపు. అంటే అలా అని సినిమా జయాపజయాల గురించి కాదు. బాంధవ్యాల గురించి.ఈ సినిమాలో బ్రహ్మోత్సవం మాదిరిగానే ఎప్పుడూ ఫ్రేమ్ లో బోలెడు మంది నటులు వుంటారట. విదేశాల్లో వుండే వారి తండ్రులు స్వదేశంలో ఒంటరిగా వుంటూ అనుభవించే మనో వేదనే శతమానం భవతి కథాంశం అంట.
తల్లితండ్రులుగా జయసధ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. వీళ్లు కబురు చేస్తే, విదేశాల్లో వుండే పిల్లా, పీచూ పరుగెత్తుకు రావడం, అక్కడి నుంచి ఆ ఇంట్లో బోలెడు మందితో కథ నడవడం అన్నమాట. ప్రకాష్ రాజ్-జయసుధలు తీసుకునే ఓ కీలక నిర్ణయం ఇంటర్వెల్ బ్యాంగ్ గా వుంటుంది.
అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ నటన, కథ, అన్నీ కలిసి సంక్రాంతి పోటీలోకి సినిమాను దింపే ధైర్యాన్ని దిల్ రాజకు ఇచ్చాయట.