Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెడ్డిగారికి సరైన టైమ్ లో హిట్

రెడ్డిగారికి సరైన టైమ్ లో హిట్

మనకు వున్న మంచి కమెడియన్లలో శ్రీనివాసరెడ్డి ఒకరు. గీతాంజలి తరువాత సోలో హీరోగా చేయాలని కూడా చిన్న కోరిక పుట్టిందో, లేదా అవకాశమే వచ్చిందో జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమా చేస్తున్నారు. పూర్ణ హీరోయిన్.

అయితే ఆ సినిమా విడుదలకు ముందుగా ప్రేమమ్ సినిమా వచ్చింది.  అత్తారింటికి దారేది, పటాస్ తరువాత మళ్లీ శ్రీనివాసరెడ్డి మరో మంచి సినిమా అయింది. అందరూ ప్రేమమ్ క్లయిమాక్స్ నే సినిమాను నిలబెట్టిందని, శ్రీనివాసరెడ్డి బాగా ఫ్లస్ అయ్యాడని అంటున్నారు.

ఈ ఎపిసోడ్ లో శ్రీనివాసరెడ్డి ఆన్ ది సెట్ కొన్ని చిన్న చిన్న స్వంత ఇంప్రూవైజేషన్ లు కూడా చేసారట. ముఖ్యంగా సిఎస్ఆర్ టైపులో సుయోధనా అనే పాచికల స్టయిల్ డైలాగ్ శ్రీనివాసరెడ్డి చేర్చినదేనట. గతంలో ఓ సినిమాలో ఇలా చేసిన సంగతిని చెప్పి, ఇక్కడా చేస్తానంటే, డైరక్టర్ చందు వెంటనే ఓకె అన్నారట. జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ముందు ఈ హిట్ రావడం అన్నది నిజంగా శ్రీనివాస రెడ్డికి ఆ సినిమాకు కాస్త కలిసి వచ్చే అంశమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?