వినదగు నెవ్వరు చెప్పిన అన్నది పెద్దల మాట. ఎనుబోతులు ఢీ కొంటున్నపుడు మధ్యలోకి లేగదూడలు వెళ్లకూడదు. మరి ప్రకాష్ రాజ్ ఏం చేసాడు. తన బుల్లి, బుజ్జి సినిమాలు భారీ సినిమాల మధ్యలోకి తోసాడు. ఏమయింది ? జనం దాన్ని కనీసం గుర్తించను కూడా లేదు. ఈస్ట్ గోదావరిలోని ఓ సెంటర్ లో రెండు షోలకు వందల్లో కలెక్షన్లు చూసి, మర్నాడు ఉదయం లేపేసారట.
మంచి సినిమా. అందులో సందేహం లేదు. కానీ మామూలుగా విడుదలయితేనే, మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే తప్ప, జనం థియేటర్లకు రారు. మరి అలాంటపుడు ఇన్ని భారీ సినిమాల మధ్య వదిలితే ఓపెనింగ్స్ ఎలా వస్తాయి? మౌత్ టాక్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. పైగా ప్రేమమ్ లాంటి హిట్ సినిమా ఎలా థియేటర్లు పెంచుకోవాలని చూస్తుంది. దానికి బలయ్యేది ఇలాంటి చిన్న సినిమాలే.
మంచి సినిమా తీయడం ఒకటే కాదు. మంచి టైమింగ్ లో వదలడం కూడా తెలియాలి. అది ఒక్క గీతా అరవింద్ కే తెలిసిన విద్య యేమో?