స్లమ్ డాగ్ హిట్ కొట్టాలి

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.  ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో జరిగిన…

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.  ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్స్ బాబీ, బుచ్చి బాబు సానా, కార్తీక్ దండు, స్టార్ హీరోయిన్ శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా హీరో సొహైల్ మాట్లాడుతూ – నిర్మాతలంతా పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనుకుంటారు. కానీ ఎలాంటి మార్కెట్ లేని కొత్త హీరోలతో సినిమాలు చేస్తూ మాలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న సంస్థ మైక్ మూవీస్. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్, స్లమ్ డాగ్ హజ్బెండ్ లాంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. వాళ్ల కోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఈ సినిమా హిట్ అయి సంజయ్ కు పేరు తీసుకురావాలి అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ – ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. పాటలు హిట్ అయ్యాయి అన్నారు. కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ – మా సినిమా కార్యక్రమానికి వచ్చిన శ్రీలీలకు థాంక్స్. ఈ సినిమా సెకండాఫ్ లో నాకు, బ్రహ్మాజీ గారికి ఉన్న కాంబినేషన్ సీన్స్ మిమ్మల్ని బాగా నవ్విస్తాయి. థియేటర్ లో చూసేందుకు రండి. అన్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ – స్లమ్ డాగ్ హజ్బెండ్ ఎలా ఉంటాడో చూసేందుకు ఇక్కడికి వచ్చాను. బ్రహ్మాజీ నాకు మంచి ఫ్రెండ్. ఒక మంచి ఆలోచన దర్శకుడికి రావడమే విజయానికి సంకేతం. అలాంటి ఐడియాను ఈ సినిమాకు పిక్ చేశాడు శ్రీధర్. సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.

దర్శకుడు ఏఆర్ శ్రీధర్ మాట్లాడుతూ – ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన అప్పరెడ్డి, వెంకట్ కు థాంక్స్. సినిమా హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. అలాగే మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సంజయ్, ప్రణవి జోడీ ఆకట్టుకునేలా ఉంటుంది. దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. ఒక కొత్త పాయింట్ తో మీ అందరికీ నచ్చేలా సినిమా చేశాను. అన్నారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ – బ్రహ్మాజీ మంచి తనం పెంచుకుంటూ ఏజ్ ను ఎప్పుడో ఆపేసుకున్నారు. పవర్ సినిమా టైమ్ లో ఒక ఇబ్బందికర సందర్భంలో నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. సంజయ్ మంచి యాక్టర్. ఈ సినిమా అతనికి హిట్ తెచ్చిపెట్టాలి. అలాగే ప్రణవి తెలుగమ్మాయి. మా సర్దార్ గబ్బర్ సింగ్ లో చిన్న క్యారెక్టర్ చేసింది. వీళ్లందరికీ ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ – ఇదొక గౌరవం ఉన్న ఇండస్ట్రీ. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే అడ్డేదీ ఉండదు. ఎలాంటి ఇబ్బందులు రావు. హీరోయిన్ ప్రణవికి నేను ఇచ్చే సలహా ఇదే. భీమ్స్ ధమాకా తర్వాత మళ్లీ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమా సూపర్ హిట్ కావాలి. అన్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ – ఇండస్ట్రీ అంతా ఈ సినిమాకు సపోర్ట్ చేసింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలి. డైరెక్టర్ శ్రీధర్ డైలాగ్స్ చెబుతుంటేనే నవ్వొచ్చేది. అంత మంచి స్క్రిప్ట్ చేశాడు. భీమ్స్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. స్లమ్ డాగ్ హజ్బెండ్ థియేటర్ లో చూడమని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ – కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ కు థాంక్స్. దర్శకుడు శ్రీధర్ ఒక ఫ్రెండ్ లా సపోర్ట్ చేశారు. ఆయనతో ఏదైనా చెప్పుకునేంత ఫ్రెండ్ అయ్యారు. ప్రణవి కొత్త హీరోయిన్ కదా అనుకున్నా… కానీ తన పర్మార్మెన్స్ చూస్తే.. నేను ఇంకా బాగా నటించాలి అనేంత జాగ్రత్త పడ్డాను. మనల్ని లైఫ్ లో సపోర్ట్ చేసేందుకు ఫ్యామిలీ ఉంటుంది. మా నాన్న, అమ్మ, నా వైఫ్ అలా నాకు సపోర్ట్ ఇచ్చారు. అందుకు థాంక్స్ చెబుతున్నా. సినిమా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.