సారీ..పూరీ..మహేష్ ఫ్రీగా లేడు

మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని సామెత. దర్శకుడు పూరి జగన్నాధ్ మీద వస్తున్న గ్యాసిప్ ల వైనం ఇలాగే వుంది. మొదలు పెట్టిన రోగ్ సినిమా అలా సగంలో వుండిపోయింది. కళ్యాణ్…

మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని సామెత. దర్శకుడు పూరి జగన్నాధ్ మీద వస్తున్న గ్యాసిప్ ల వైనం ఇలాగే వుంది. మొదలు పెట్టిన రోగ్ సినిమా అలా సగంలో వుండిపోయింది. కళ్యాణ్ రామ్ పుణ్యమా అని సినిమా వస్తే, భారీగా వాళ్ల చేత ఖర్చు చేయించడంతో 26 కోట్ల బడ్జెట్ తో ఇజం సినిమా తెల్ల ఏనుగులా మారింది. ఇప్పుడ దాని విడుదలకు నందమూరి బ్రదర్స్ కిందా మీదా పడుతున్నారు. 

ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో పూరి తరువాత సినిమా మహేష్ నా, ఎన్టీఆర్ నా అని గ్యాసిప్ లు. మహేష్ మూడు సినిమాలకు సైలెంట్ గా రెడీ అయిపోయి వున్నాడు. జనవరి నుంచో ఫ్రిబ్రవరి నుంచో కొరటాల శివ, జూన్ నుంచి మహేష్ పైడిపల్లి, అది పూర్తయ్యాక సుకుమార్. వీటికి నిర్మాతలు కూడా రెడీ అయిపోయి వున్నారు. దానయ్య, పివిపి, 14రీల్స్. మరి ఇందులో పూరికి స్పేస్ ఎక్కడ. మరో ఏడాదిన్నర తరువాతి సంగతి.

ఇక ఎన్టీఆర్ మాత్రమే ఆప్షన్ మిగిలింది. కానీ జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ ఆలోచన కూడా మారింది. ఇటు మాస్ అటు ఫ్యామిలీ కలగలసిన కథలకే ఎన్టీఆర్ ఓటు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఫ్యామిలీ కథలకే చాయిస్ ఎక్కువ. పూరి దగ్గర నుంచి పొరపాటున కూడా ఇలాంటి కథలు ఆశించడం అత్యాశే. ఫ్యామిలీ కథలను కూడా వీలయినంత గాడీగా తీయడంలో స్పెషలిస్ట్ ఆయన. కావాలంటే లోఫర్ చూడుడు. మరి అలాంటి నేపథ్యంలో పూరికి ఎన్టీఆర్ చాన్స్ ఇస్తారా? అనుమానమే. 

మరి ఎందుకు ఈ గ్యాసిప్ లు వినవస్తున్నాయి? కాస్త ఆలోచిస్తే, ఈ గ్యాసిప్ లు, ఫీలర్లు ఎక్కడ నుంచి బయల్దేరి వుంటాయో తట్టడం పెద్ద కష్టం కాదు.