లాంగర్, హార్డర్, మోర్… సెక్స్ కి ‘కీ’లలో ఒకటి “డర్టీ టాక్’ అంటున్నారు సెక్స్ ఎక్స్ పర్ట్లు! రొటీన్ శృంగార జీవితానికి దీన్ని యాడ్ చేయండంటున్నారు. ఇప్పటికే ఈ తరహా ఆనందాన్ని అనుభవిస్తుంటే ఓకే, లేకపోతే సెక్సీ మర్మరింగ్.. మీ శృంగార జీవితాన్ని ఇట్టే మార్చేయగల టెక్నిక్ అని డేటింగ్ కోచ్ లు చెబుతున్నారు.
ఎంతటి కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే.. శృంగారంలో డర్టీ టాక్ ను ఇష్టపడగలదంటున్నారు! ఒంట్లో చెరకు రసం ప్రహిస్తున్న వేళ, ప్రియ సఖుడి నుంచి జాలు వారే పదజాలాన్ని వ్యవహారికంగా డర్టీ టాక్ అనే అనుకున్నా, అది అంతులేని కిక్ ఇస్తుందంటున్నారు వీళ్లు. దేశానికో, ప్రాంతానికో పరిమితం అయ్యే థియరీ కాదు, ప్రాక్టికల్ గా ప్రతి చోటా ఇది రుజువనదగ్గ విషయమే అని వారు నొక్కి వక్కాణిస్తున్నారు. పురుషుడు మానసికంగా ఆప్తుడైపోయి, శారీరకంగా దగ్గరవుతున్న వేళ ఆమె ‘ఎఫ్’ వర్డ్ ను ప్రయోగించడం అంత అబ్బురంగా చెప్పుకోవాల్సిన అంశమేమీ కాదు, శృంగారమంత సహజమైన విషయమే అది అని చెబుతున్నారు.
అబ్సలూట్ బెస్ట్ పీస్ అడ్వైజ్ లలో ‘డర్టీ టాక్’ ను ప్రముఖమైనదిగా పేర్కొంటున్నారు సెక్స్ ఎక్స్ పర్ట్లు. ఈ విషయాన్ని చాలా మందికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని, చాలా మంది ప్రాక్టికల్ గా పార్ట్ నర్ తో ఈ మజాను అనుభవిస్తున్నారని కూడా వారు చెబుతుండటం విశేషం. ప్రత్యేకించి దూరదూరంగా ఉన్నప్పుడు ఈ తరహా భాష ఎక్కువవుతుందని అంటున్నారు. మొబైల్, ఇంటర్నెట్ చాటింగ్ లో డబుల్ మీనింగ్స్ తో మొదలుపెట్టి, డర్టీ చాట్ చేయడం సహజమైన విషయంగా మారిందంటున్నారు.
ఆల్రెడీ అలవాటున్న వారి సంగతి సరే, కొత్తగా అయితే.. మరి ఇంతకూ.. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలంటే మాత్రం దీనికీ కొన్ని సలహాలు ఇస్తున్నారు! ఆమె అందాలను వర్ణించి చెప్పడం, శృంగారం గురించి డిప్లోమాటిక్ వర్డ్స్ లో మాట్లాడుతూ మీడియా పరిభాషను ఉపయోగించడం కాకుండా వ్యవహారికంలో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి రాయడం కష్టం బాబోయ్…మీకు తెలియనిదేమీ లేదు, మీరే పూరించుకోండి అంటూ ముగించారు.