మజ్ఙు సినిమా ముందు కాస్త డివైడ్ టాక్ వచ్చినా, మంచి రివ్యూలే పడ్డాయి. వర్షాల ఎఫెక్ట్ కొంత వున్నా మంచి ఓపెనింగ్స్ నే వచ్చాయి. ప్రస్తుతానికి అర్బన్ సెంటర్లలో కలెక్షన్లు కాస్త స్టడీగానే వున్నాయి. అయితే రూరల్ సెంటర్లు ఓ మాదిరిగా వున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఫ్రైడే వచ్చేయడంతో మజ్ఞు కాస్త ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది.
ఇప్పటికి బయ్యర్లకు ఫిఫ్టీ నుంచి సిక్స్ టీ పర్సంట్ మాత్రమే రికవరీ అయింది. ఫస్ట్ వీక్ ఫిఫ్టీ పర్సంట్ టు సిక్స్ టీ పర్సంట్..అది కూడా సోలోగా. మరి సెకెండ్ వీక్ సంగతేమిటి? హైపర్ లాంటి బి సి సెంటర్ల మాస్ సినిమా వుంది. సో మిగిలిన ఫార్టీ, ఫిఫ్టీ ఫర్సంట్ రికవరీ అంత ఈజీ కాకపోవచ్చు. పైగా ఆ పైన ఖర్చులు రావాలి. అప్పుడు కమిషన్ మాట.
కానీ తరువాత వారం ఏకంగా నాలుగైదు పెద్ద సినిమాలు వున్నాయి. అంటే అక్కడి నుంచి మరీ కష్టం అవుతుంది. ఈ లెక్కన చూస్తుంటే మజ్ఞు కాస్త ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది.