మెగాస్టార్ అండర్ మేకింగ్

సినిమా ఫంక్షన్ అన్నాక ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ వుండాలి. వుంటేనే ఫంక్షన్ కు కళ. అలా కళ వస్తేనే సినిమాకు కళ. అందుకే ఎవరి రేంజ్ లో వారు ప్రయత్నించి, వారి వారి…

సినిమా ఫంక్షన్ అన్నాక ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ వుండాలి. వుంటేనే ఫంక్షన్ కు కళ. అలా కళ వస్తేనే సినిమాకు కళ. అందుకే ఎవరి రేంజ్ లో వారు ప్రయత్నించి, వారి వారి మొహమాటాలు వాడి చీఫ్ గెస్ట్ గా ఎవరో ఒకర్ని తెచ్చుకువస్తారు. అయితే అలా వస్తున్నంత మాత్రాన పెద్దగా హడావుడి చేయరు. వస్తున్నారు అని చెబుతారు. వచ్చిన వాళ్ల పట్ల కాస్త ఎక్కువ గౌరవ మర్యాదలు చూపిస్తారు. అంతే.

కానీ అల్లు అర్జున్ విషయంలో వ్యవహారం వేరుగా వుంది. అసలు చావుకబురుచల్లగా అనే సినిమా గురించి, దాని ఫంక్షన్ గురించి పక్కన పెట్టి, బన్నీ రాక మీద ప్రోమోలు కట్ చేస్తున్నారు. 

అల వైకుంఠపురం లాంటి సినిమాల క్లిప్స్ కట్ చేసి, బన్నీ రాకపై ప్రోమోలు వదిలారు. కార్తికేయ చిన్న హీరో కావచ్చు. కానీ 'ఆయన వస్తున్నారా..ఆయన వస్తున్నారా..ఒప్పుకున్నారా' అంటూ భయంకరమైన ఎగ్జయిట్ మెంట్ విడియోలు కట్ చేసి వదిలారు. 

నిజానికి పవన్ కళ్యాణ్ నో, మెగాస్టార్ నో వస్తే ఇలా వదిలారు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. మెగా హీరోల్లో మెగాస్టార్ గా బన్నీ వుండాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. మెగాస్టార్, పవన్ కళ్యాణ్ తరువాత మెగాహీరోల్లో టాప్ ప్లేస్ బన్నీదే వుంది. 

రామ్ చరణ్  ఆ తరువాతే. అంటే భవిష్యత్ లో మెగా హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్ బన్నీ కోసమే రెడీ గా వున్నట్లు, రెడీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య కాకినాడలో షూటింగ్ కు వెళ్తే ఊరేగింపు, మొన్నటికి మొన్న మారేడిమిల్లి ఏరియాలో జనాల్లో ఊరేగింపు, ఇవన్నీ చూస్తుంటే చాలా వెల్ ప్లాన్డ్ గా బన్నీ తనను తానే ఎలివేట్ చేసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

మీరు మారిపోయారు సార్‌

త‌ప్పు క‌దా..?