సీటీమార్…టైటిల్ సాంగ్

సంపత్ నంది-గోపీచంద్ లో తయారవుతున్న భారీ బడ్జెట్ సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో రాసుకున్న యాక్షన్ స్టోరీ. ఏప్రిల్ 2న విడుదలవుతున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ ను విడుదల చేసారు. Advertisement ఇటు…

సంపత్ నంది-గోపీచంద్ లో తయారవుతున్న భారీ బడ్జెట్ సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో రాసుకున్న యాక్షన్ స్టోరీ. ఏప్రిల్ 2న విడుదలవుతున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ ను విడుదల చేసారు.

ఇటు కబడ్డీ నేపథ్యం, అటు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇలా రెండింటికీ పనికి వచ్చేలా సాంగ్ ను కాసర్ల శ్యామ్ రచించారు. పాట లుక్ గ్రాండియర్ గా వుండడానికి గోదావరి, ఆ ప్రాంత వరిచేలు నేపథ్యం తీసుకున్నారు.

దాంతో పాటకు మాంచి కలర్ వచ్చింది. బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అనిపించుకుంది. పాట ట్యూన్ మాత్రం జనాలకు పట్టడానికి టైమ్ పడుతుంది. మణిశర్మ ట్యూన్ కాస్త టఫ్ గా వుంది. కాసర్ల శ్యామ్ ఇప్పటి వరకు రాసిన పాటలు వేరు. ఈ పాట వేరు. ఈ తరహా పాటలు కూడా తను రాయగలను అనిపించుకున్నాడు. 

సిల్వర్ స్క్రీన్ పతాకంపై చిట్టూరి శ్రీను టఫ్ కాంపిటీషన్ నడుమ ఏప్రిల్ 2న విడుదలవుతోంది. సినిమా మీద గట్టి నమ్మకం వుండడంతో మేకర్లు జంకకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరనస తమన్నా నటిస్తోంది.