పోర్టు వెళ్లి ఉక్కుతో మొరపెట్టుకున్నట్టుంది

నిన్నటివరకూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి అంటూ ధర్నా చేస్తున్నవారికి ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఉక్కు కోసం ధర్నా చేయాలా, లేక కొత్తగా పోర్టు కోసం రంగంలోకి దిగాలా అనే డైలమాలో…

నిన్నటివరకూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి అంటూ ధర్నా చేస్తున్నవారికి ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఉక్కు కోసం ధర్నా చేయాలా, లేక కొత్తగా పోర్టు కోసం రంగంలోకి దిగాలా అనే డైలమాలో పడేసింది కేంద్రం. విశాఖ ఉక్కే కాదు, ఓడరేవు కూడా త్వరలో ప్రైవేటుపరం కాబోతోంది. ఆ మాటకొస్తే ఒక్క విశాఖ ఓడ రేవే కాదు.. దేశంలోని ప్రధాన ఓడరేవులన్నీ ఇకపై ప్రైవేటుపరం కాబోతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం మేజర్ పోర్టుల అథారిటీ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టాల్సిన ప్రాజెక్ట్ ల విషయంలో కేంద్రాన్ని సంప్రదించకుండానే.. పోర్ట్ అథారిటీలకు అధికారం కల్పించే చట్టం ఇది. ఒకరకంగా ప్రభుత్వం తన పెత్తనాన్ని తగ్గించుకుంటూ, అప్పటి వరకూ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కే ఎక్కువ అధికారాలు కట్టబెట్టింది.

పోర్ట్ ల వ్యవహారంలో కేంద్రానిది ఎంత పెద్ద మనసో అనుకున్నారంతా. కట్ చేస్తే రోజుల వ్యవధిలోనే మారిటైం ఇండియా సమ్మిట్ -2021లో ప్రధాని మోదీ బాంబు పేల్చారు. భవిష్యత్ ముఖచిత్రాన్ని కళ్లకు కట్టారు. పోర్టుల్లో పెట్టుబడులు పెట్టండి, పోర్టులను మీవిగా భావించి వ్యాపారం చేయమంటూ ప్రైవేటుకు గేట్లు తెరిచేశారు.

ఇప్పటి వరకూ ఎయిర్ పోర్టుల్లో ఈ తరహా పీపీఏ విధానాలు అమలులో ఉన్నాయి. భూమి, మౌలిక వసతులు పోర్టు యాజమాన్యం చేతుల్లో ఉంటాయి, దాని నిర్వహణ కార్యకలాపాలన్నీ ప్రైవేటు కంపెనీలకు దఖలు పడతాయి. ఇదే పద్ధతిలో పోర్టుల్ని కూడా అప్పగించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసింది కేంద్రం. 2024కల్లా 39 బెర్తులను పీపీఏ తరహాలో ప్రైవేటుకి అప్పగించాలని టార్గెట్ పెట్టుకుంది.

ఇప్పటికే ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం రాష్ట్రంలో సెగలు రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ జగన్ సర్కార్ కేంద్రంతో సంప్రదింపులు జరుపుకుంటే.. దీన్ని వీలైనంత వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ది పొందాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పుడు దీనికి విశాఖ పోర్టు కూడా జతకలిసింది. ఇటు ఉక్కు ఉద్యమం, అటు పోర్టు ఉద్యోగుల పోరుబాటతో ప్రశాంతంగా ఉండే విశాఖ అట్టుడికేలా ఉంది.

మీరు  మారిపోయారు సార్‌

త‌ప్పు క‌దా..?