పూరి కథ నిఖిల్ గౌడ్ కు నచ్చలేదట

పాపం, పూరి జగన్నాధ్..చిరంజీవి 150 వ సినిమాకు కథ చెబుదాం అనుకున్నాడు. సగమే చెప్పాడు. మిగతాది రేపు అన్నాడో, మరి నచ్చలేదో, మెగాస్టార్ చాన్స్ ఇవ్వలేదు.  ఎన్టీఆర్ కు సగం కథ చెప్పాడు. మిగిలినది…

పాపం, పూరి జగన్నాధ్..చిరంజీవి 150 వ సినిమాకు కథ చెబుదాం అనుకున్నాడు. సగమే చెప్పాడు. మిగతాది రేపు అన్నాడో, మరి నచ్చలేదో, మెగాస్టార్ చాన్స్ ఇవ్వలేదు.  ఎన్టీఆర్ కు సగం కథ చెప్పాడు. మిగిలినది చెప్పలేదు అని టాక్. సో, అక్కడా చాన్స్ దొరకలేదు.

కొన్నాళ్ల క్రితం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ్ కోసం కథ చెప్పాడట. కానీ అది బాగాలేదని కుమారస్వామి నో అని చెప్పేసాడట. ఆ విషయం ఆయనే క్లియర్ గా చెప్పేసారు. కథ బాగాలేదు. అందుకే పూరి తో సినిమా చేయలేదు అని. మళ్లీ పూరి ఇటీవల వచ్చి కలిసారని, మంచి కథ వుంటే చేద్దాం అని చెప్పానని అన్నారు. 

కానీ అక్కడే వుంది సమస్య. మంచి కథ వుంటే…పూరి దగ్గర మంచి కథలే వుంటే ఇలా వరుసగా డిజాస్టర్లు ఎందుకు వస్తాయి. పెద్ద హీరోలు ఎందుకు పక్కన పెడతారు?