మెగా హీరోస్‌కి ఏమయ్యింది.?

ఎప్పుడో సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా విడుదలవుతుంది. దసరాకి విడుదలవ్వాల్సిన చరణ్‌ 'ధృవ' డిసెంబర్‌కి వెళ్ళిపోయింది. సంక్రాంతికి ప్లాన్‌ చేసిన 'కాటమరాయుడు' ఎప్పుడు విడుదల.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల…

ఎప్పుడో సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా విడుదలవుతుంది. దసరాకి విడుదలవ్వాల్సిన చరణ్‌ 'ధృవ' డిసెంబర్‌కి వెళ్ళిపోయింది. సంక్రాంతికి ప్లాన్‌ చేసిన 'కాటమరాయుడు' ఎప్పుడు విడుదల.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అసలు మెగా హీరోస్‌కి ఏమయ్యింది.? ఏదీ ప్లానింగ్‌.? ఏదీ కమిట్‌మెంట్‌.? మెగా అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్నలివి. 

మామూలుగా అయితే అభిమానులూ ఈ 'డిలే'ని అంత సీరియస్‌గా తీసుకునేవారు కారేమో.! కానీ, ఇప్పుడు పరిస్థితులు మామూలుగా లేవు. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై మెగా కాంపౌండ్‌ పట్టు తప్పుతోంది. వరుసగా అన్నీ 40 కోట్ల పై చిలుకు వసూళ్ళు సాధించాయనే చరణ్‌ రికార్డ్‌ అటకెక్కి, ఇప్పుడన్నీ 70 కోట్ల సినిమాలే అన్నట్లు పరిస్థితులు మారాయి. దాంతో వున్నపళంగా, మెగా హీరోస్‌కి సెన్సేషనల్‌ హిట్‌ ఒకటి తగలాలి. 

'ధృవ' చూస్తే, 50 కోట్ల సినిమా అవుతుందేమోగానీ, 70 కోట్ల సినిమా అయ్యే అవకాశాలు తక్కువేనన్న టాక్‌ విడుదలకు ముందే విన్పిస్తోంది. చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా సంగతి సరే సరి. ఈ రెండూ ఓవర్సీస్‌ మార్కెట్‌పై పట్టు చూపించే అవకాశాలు చాలా చాలా తక్కువన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారం. చరణ్‌ చేస్తున్న 'కాటమరాయుడు'పై మాత్రం అంచనాలున్నాయి. కానీ ఏం లాభం.? ఆ సినిమా ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. అసలు ఇంతవరకు సెట్స్‌ మీదకే వెళ్ళలేదు 'కాటమరాయుడు'. 

అన్నీ అనుకున్నట్లుగా జరిగి వుంటే, ఈ పాటికి 'ధృవ' విడుదల సందడి షురూ అయ్యేది. ఆ వేవ్‌లోనే మెగా ఫ్యాన్స్‌ 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూసేవారు. తర్వాత ఎటూ పవర్‌స్టార్‌ పండగ వుంటుందనుకోండి.. అది వేరే విషయం. కానీ, ఇప్పుడు అంచనాలు తారుమారయ్యాయి. మరి, మళ్ళీ ఈ మూడు సినిమాలపైనా అంచనాలు క్రియేట్‌ అయ్యదెలా.?