సుకుమార్-రామ్ చరణ్ సినిమా వ్వవహారాలు మెలమెల్లగా మొదలవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమా వచ్చేనెల ఫస్ట్ వీకెండ్ దాటేసరికి ఫినిష్ అయిపోతుంది. నవంబర్ నుంచి తాను సుకుమార్ సినిమా రెడీ అని చరణ్ చెప్పేసారు. సో, ఇక సుకుమార్ దే ఆలస్యం. అందుకే ఆ సినిమా ఏర్పాట్లలో బిజీ అయ్యారు. దేవీ శ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతం కన్ ఫర్మ్. రత్నవేలు మాత్రం ఈ సినిమాకు పనిచేయడం లేదు. ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాకు ఆర్ట్ వర్క్ చేసిన రవీందర్ ఈ సినిమాకూ పనిచేసే అవకాశం వుంది. ముందుగా లొకేషన్ల కు రెక్కీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అటవీ వాతావరణం, దానికి ఆనుకుని వున్న పల్లె, కాస్త వాటర్ సోర్స్ ఇలా మంచి లుక్ వున్న లోకేషన్ కావాలి కథకు. కేరళ అన్నది మన జనాలకు బాగా అలవాటైపోయింది కనుక, కర్ణాటకలో వెదికితే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారు.
ఇదిలా వుంటే మంచి ఫ్యామిలీ లుక్ వున్న హీరోయిన్ కావాలని సుకుమార్ భావిస్తున్నారు. ఇప్పుడున్నవారు అందరూ దాదాపు నోటెట్ ఫేస్ లు అయిపోయాయి. బాలీవుడ్ నుంచి ఎవర్నయినా తేవాలా? కొత్తగా ఎవర్నయినా ట్రయ్ చేయాలా అన్న డిస్కషన్లు నడుస్తున్నాయి.
ఎవరయినా ఫరవాలేదు కానీ కాస్త మంచి పెర్ ఫార్మర్ కావాలని సుకుమార్ అడుగుతున్నారని తెలుస్తోంది. ఆ మేరకు అనేక పేర్లు డిస్కషన్లో వున్నాయి. వన్ వీక్ లో చాలా వరకు క్లారిటీ రావచ్చు. జనతా గ్యారేజ్ హడావుడి దాదాపు ముగిసిపోవడంతో మైత్రీ మూవీస్ ఇప్పుడు ఈ సినిమా మీదకు వచ్చేసింది.