చాన్నాళ్ల తరువాత 14 రీల్స్ సంస్థ టైమ్ బాగున్నట్లుంది. రామ్ తో నిర్మిస్తున్న హైపర్ సినిమాకు మంచి మార్కెట్ జరిగింది. దీంతో నాలుగు కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ చేసుకుంది. సినిమా విడుదల ఇంకా రెండు వారాల దూరం వుండగానే సేల్ ఫినిష్ చేసేసారు. సీడెడ్ కు సాయి కొర్రపాటి, నైజాం కు మల్కాపురం శివకుమార్ బయ్యర్లుగా సెట్ అయ్యారు.
సీడెడ్ కు మూడు కోట్ల పై చిలుకు మొత్తానికి బేరం ఫిక్స్ అయింది. మిగిలిన ఏరియాల అమౌంట్ లు తెలియాల్సివుంది. మొత్తం మీద ఓవర్ సీస్ తో కలిపి థియేటర్ రైట్స్ 22 కోట్ల మేరకు అమ్మకాలు సాగించారు. సినిమాకు అన్నీ కలిపి 18 కోట్లు ఖర్చు అయింది. సో..మంచి లాభం చేసుకున్నట్లే. ఇది కాక ఇంకా శాటిలైట్ వుండనే వుంది. సో, 14 రీల్స్ సంస్థ పాత నష్టాలు కొన్ని పూడ్చుకోవచ్చు.