ఆ గుడ్డి కథలు ఏమవుతాయో?

ముగ్గురు రచయిత కమ్ దర్శకులు మూడు గుడ్డి కథలు తయారుచేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, వెలిగొండ శ్రీనివాస్. త్రివిక్రమ్ ఏకంగా సూర్య హీరోగా చేయాలనుకున్నారు. అనిల్ రావిపూడి హీరో రామ్ తో తెరకెక్కించాలనుకున్నారు.…

ముగ్గురు రచయిత కమ్ దర్శకులు మూడు గుడ్డి కథలు తయారుచేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, వెలిగొండ శ్రీనివాస్. త్రివిక్రమ్ ఏకంగా సూర్య హీరోగా చేయాలనుకున్నారు. అనిల్ రావిపూడి హీరో రామ్ తో తెరకెక్కించాలనుకున్నారు. కానీ త్రివిక్రమ్ ప్రాజెక్టు ఆగిపోయింది. అనిల్ రావిపూడి ప్రాజెక్టు కూడా అలాగే అయ్యింది. అయితే అనిల్ రావిపూడి కథలో సినిమా మొత్తం హీరో గుడ్డివాడిగానే వుంటాడు. అలాగే సినిమా ముగుస్తుంది. 

మరి అలాంటపుడు ప్రేక్షకులు జీర్ణించుకోగలరా అన్నది అనుమానం. ఎందుకంటే ఇది సిరిసిరిమువ్వ, సిరివెన్నెల నాటి కాలం కాదు కదా? అందుకే ఆ ప్రాజెక్టు అలా వుండిపోయింది. ఇక వెలిగొండ శ్రీనివాస్ కథలో ఇంటర్వెల్ దాకానే హీరో గుడ్డివాడు. సెకండాఫ్ లో మామూలుగానే వుంటాడు. అందుకే ఆ ప్రాజెక్టు రాజ్ తరుణ్ హీరోగా, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రెడీ అవుతోంది. 

మరి వుండిపోయిన, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి కథలు ఏం చేస్తారో? ఏ హీరో అయినా ధైర్యం చేస్తారా? అంతకన్నా ముందుగా నిర్మాతలు ధైర్యం చేయాలి కదా?