దసరా స్పెషల్‌: ‘కాటమరాయుడు’ కొత్త లుక్‌.!

పవన్‌కళ్యాణ్‌ హీరోగా 'కాటమరాయుడు' పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం విదితమే. ఇప్పటికే సినిమా షూటింగ్‌ ప్రారంభమయిపోయిందనే ప్రచారం జరుగుతున్నా, ఆ 'శకలు' ఏమీ కన్పించడంలేదు. కిషోర్‌ కుమార్‌ పార్దసాని (డాలీ) దర్శకత్వంలో రూపొందనున్న…

పవన్‌కళ్యాణ్‌ హీరోగా 'కాటమరాయుడు' పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం విదితమే. ఇప్పటికే సినిమా షూటింగ్‌ ప్రారంభమయిపోయిందనే ప్రచారం జరుగుతున్నా, ఆ 'శకలు' ఏమీ కన్పించడంలేదు. కిషోర్‌ కుమార్‌ పార్దసాని (డాలీ) దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన శరద్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైనా, అదేదో హర్రీ బర్రీగా విడుదల చేసిన లుక్‌ తప్ప, అది నిజానికి సినిమాలోని లుక్‌ కాదనే వాదనలున్నాయి. పాత ఫొటోకి, కాస్తంత గ్రాఫిక్‌ జిమ్మిక్కుల్ని చేర్చి, ఫస్ట్‌ లుక్‌.. అంటూ విడుదల చేసేశారు. ఆ విషయం లుక్‌ విడుదలైన వెంటనే ముందుగా పవన్‌ అభిమానులే కనిపెట్టేశారు. దాంతో, ఇంకో లుక్‌ విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఈ నెలాఖరు నుంచి పవన్‌కళ్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొంటాడనీ, శరవేగంగా సినిమా షూటింగ్‌ జరుపుతారనీ ప్రచారం జరుగుతున్నా, అదెంత నిజమో ఏమోనన్న సందేహాలూ లేకపోలేదు. ఈ సినిమాకి సంబంధించి తాజా ఖబర్‌ ఏంటంటే, విజయదశమి కానుకగా, ఈ సినిమా తాజా లుక్‌ని విడుదల చేస్తారట. ఈసారి మాత్రం పవన్‌కళ్యాణ్‌తో ఫొటో సెషన్‌ చేసి, పెర్‌ఫెక్ట్‌ లుక్‌ని విడుదల చేయాలన్నది చిత్ర దర్శక నిర్మాతల ఆలోచన. ఏమో, ఇదెంత నిజమో.. వేచి చూడాల్సిందే.